సెయింట్ మెరిస్ పాఠశాల పై చర్యలు తీసుకోవాలి.
పాఠశాల ముందు ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులు.
బెల్లంపల్లి, సెప్టెంబర్19,(జనంసాక్షి)
బెల్లంపల్లి సెయింట్ మేరీస్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ కార్యక్రమానికి హాజరు కానీ విద్యార్థులను ఎండలో నిలబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతు విద్యర్ధులను వజ్రోత్సవ ర్యాలీ కి సెయింట్ మెరిస్ పాఠశాల యాజమాన్యం విద్యార్థులను తీసుకు వెళ్లడం జరిగిందని. ఆర్యాలీకి హాజరు కానీ విద్యర్ధులను ఆరోగ్యం బాగు లేకున్నా ఎండలో నిలబెట్టారని, ఈసంఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం వజ్రోత్సవాల పేరుతో విద్యార్థులకు విద్యను దూరం చేస్తు, విద్యార్థుల భవిషత్తు తో చెలగాటం ఆడుతున్నారని వారన్నారు. విద్యార్థులను ఎండలో నిలబెట్టిన సెయింట్ మెరిస్ పాఠశాల పై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని యెడలవిద్యార్థి సంఘాల ఆధ్వర్యం లో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీజీవిపి జిల్లా అధ్యక్షుడు నాయిని మురళి శ్రావణ్, పిడిఎస్యూ జిల్లా అధ్యక్షుడు రెడ్డి చరణ్, నాయకులు సన్నీ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు