సెలబ్రిటీలను కాదని ట్రాన్స్‌జెండర్.. తెలంగాణ ఎన్నికల ప్రచారకర్తగా ఎంపిక
సెలబ్రిటీలను కాదని ట్రాన్స్‌జెండర్.. తెలంగాణ ఎన్నికల ప్రచారకర్తగా ఎంపిక
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. అన్ని పార్టీలు ఎన్నికల యుద్ధానికి సిద్ధమయ్యాయి. ఎన్నికల వ్యూహాలు రచిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఓటర్ల జాబితాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్నికల జాబితా, ఏర్పాట్లు తదితర అంశాలపై దృష్టిసారించారు.
ఈసారి ఎన్నికల నిర్వహణలో ఓ ట్రాన్స్‌జెండర్‌కు అరుదైన అవకాశం దక్కింది. తొలిసారిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రచారకర్తగా ఒక ట్రాన్స్‌జెండర్ ఎంపికయ్యారు. ఓటరు నమోదు, సవరణ, మార్పులు, చేర్పులు, ఓటు వినియోగం ప్రయోజనాలు తదితర అంశాలపై ప్రజలను చైతన్యం చేయడానికి ఎన్నికల కమిషన్ ప్రచార కార్యక్రమాలు చేపడుతుంది. సెలబ్రిటీలు, నటులు, సామాజిక వేత్తలను తమ ప్రచారకర్తలుగా ఎంపిక చేసి ప్రజల్లో అవగాహన తీసుకొస్తుంది. ఈసారి వరంగల్ నగరంలోని కరీమాబాద్ ప్రాంతానికి చెందిన ట్రాన్స్‌జెండర్ లైలాను ప్రచారకర్తగా ఎంపిక చేసింది.