సెలవుపై వెళ్లిన డిఆర్‌వో వెంకటేశ్వర్లు
గుంటూరు, జూలై 15 (ఎపిఇఎంఎస్):
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘవీరారెడ్డి, ఆదేశాలతో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు సెలవులపై వెళ్లారు. గురజాల తహశీల్దార్ సుజాత తనపట్ల డిఆర్వో వెంకటేశ్వర్లు అసభ్యంగా వ్యవహరించినట్లు కలెక్టర్‌కు, జెసికి ఫిర్యాదు చేసారు. దీనిపై రెవెన్యూ అసోసియేషన్ జిల్లా నాయకులు ఆందోళనకు దిగటమే కాకుండా కలెక్టరేట్‌లో పెద్ద ఎత్తున నిరశన వ్యక్తం చేశారు. పరిస్థితిని వాకాబు చేసిన మంత్రి రఘవీరారెడ్డి, జెసి యువరాజ్‌ను నివేదిక పంపాల్సిందిగా ఆదేశించారు. నివేదిక అందిన తరువాత డిఆర్వోను సస్పెండ్ చేస్తామని మంత్రి రఘవీరారెడ్డి స్పష్టం చేశారు. డిఆర్వో వెంకటేశ్వర్లుపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో సెలవుపై పంపించారు. ఆయన స్థానంలో కొత్త డిఆర్వోగా నాగబాబు మూడు రోజుల్లో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.