సెల్ సేవలు బ్లాక్ చేసినా ఆగేదిలేదు :తాలిబన్లు
ఇస్లామాబాద్ తీవ్రవాద ప్రభావం ఎక్కువగా ఉన్న పలు ప్రాంతాలలో ఉంగ్రవాద కర్యకలాపాలను అడ్డుకునే చర్యల్లో భాగంగా సెల్‌ఫోన్ సెవలను బాక్ల్ చేయాలనుకుంటున్న పాకిస్థాన్ ప్రభుత్వ ఆలోచనల్ని తాలిబన్లు తోసిపుచ్చారు.తీము మొబైల్ పోన్ల ద్వారా బాంబు దాడులు చేయబోమని అందువల్ల మొబైల్‌పోన్ సేవలను నిలిపివేసినప్పటికీ తమను ఆపలేరని నిషేధిత తెహ్రీక్ -ఇ -తాలిబస్ పాకిస్థాన్ అధికార ప్రతినిధి ఇహ్‌సానుల్లా ఇహ్‌సాన్ స్పష్టం చేశారు. ఎలాగైనా మాలక్ష్యాలను సాధిస్తాం అన్న ఇహ్‌సాన్ ప్రకటనను డాస్ వార్తా పత్రిక వెబ్‌సైట్ ఉటంకించింది.
ఉగ్రవాదుల బాంబు దాడుల్లో 90 శాతం మొబైల్ సిమ్‌ల ద్వారానే జరుగుతున్నందున కరాచీ, క్వెట్టా, ఇస్లామాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో మొబైల్ సేవలను నిలిపివేశామని విలేకరులకు పాక్ హోంమంత్రి రెహ్మాన్ మాలిక్ ఇచ్చిన సమాచారంపై ‘తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్’ ప్రతినిధి ఇహ్‌సాన్ స్పందించాడు
పవిత్ర ముహరం మాసం నేపథ్యంలో షియా ముస్తింలు నిర్వహించే ఊరేగింపులపై ఉగ్రవాద దాడులు జరుగకుండా నిరోధించేందుకే ఆదివారం వరకూ పలు నగరాల్లో మొబైల్ సేవలను నిలిపివేస్తున్నట్లు హోంమంత్రి రెహ్మా మాలిక్ తెలిపారు. ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడుల్లో ‘తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్’ అధినేత హకీముల్లా మెహ్‌సూద్ హస్తముందన్నారు.
”ముస్లింగా చెప్పుకుంటున్న హకీముల్లీ షరియాను అమలు చేయాలంటున్నాడు. అయితే, బాంబులతో నీ ముస్లిం సోదర సోరరీమణులను చంపమని ఇస్లాం చెప్పిందా? మాలిక్ ప్రశ్నించారు. కాగా, స్వంత వ్యాపార ప్రయోజనాల కోసమే మొబైల్ సేవలను హోంమంత్రి మాలిక్ నిలిపిచేయిస్తున్నారని తాలిబన్ ప్రతినిధి ఆరోపించాడు.