సెస్ ఎన్నికల కోసం మొదలైన నామినేషన్ల పర్వం.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. డిసెంబర్ 13. (జనం సాక్షి) సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ సెస్ పాలకవర్గం ఎన్నికల కోసం నామినేషన్ల పర్వం మంగళవారం ప్రారంభమైంది. సిరిసిల్ల టౌన్ టూ నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు సుభాష్ రావు, స్వతంత్ర అభ్యర్థిగా గుర్రం రాజలింగం గౌడ్, వేములవాడ టౌన్ వన్ నుంచి వైఎస్ఆర్ టిపి జిల్లా అధ్యక్షులు చొక్కల రాము, తంగాల్లపల్లి మండలం నుంచి కాంగ్రస్ పార్టీ నుంచి టోనీ, పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల పర్వం కొనసాగనుంది.సెస్ కార్యాలయం వద్ద సందడి వాతావరణం చోటుచేసుకుంది