సెస్ ఓటర్ లిస్టు గోప్యత వెనుక మతలబు ఏంటి.!
సిరిసిల్ల టౌన్. డిసెంబర్ 9 (జనం సాక్షి)
సెస్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది .ఈనెల 13వ తేదీన నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. కానీ అధికారులు మాత్రం ఇప్పటివరకు ఓటర్ జాబుతాను బహిరంగ పరచకుండా కేవలం మున్సిపల్ మున్సిపల్ వార్డులోని వార్డు కార్యాలయంల్లో ఓటర్ లిస్టు చెకప్ కోసం మాత్రమే పెట్టారు జనరల్ ఓటర్ లిస్టు ఇవ్వాలని కోరిన పలువురికి చేదు అనుభవమే ఎదురవుతోంది.ఈనెల 13న నామినేషన్ వేసిన అభ్యర్థులకు మాత్రమే దానికి సంబంధించిన కస్ట్ అప్ అమౌంట్ కడితే ఓటర్ లిస్ట్ ఇస్తామని అధికారులు సెలవిస్తున్నారు. బహిరంగ ప్రదర్శించాల్సిన ఓటర్ లిస్ట్ ను గోప్యంగా ఉంచడం వెనుక మతల ఏమిటి అన్నది అధికారులకే తెలియాలి. ఓటర్ జాబితా ఉంచడంపై నామినేషన్ వేసే అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏమి వచ్చిందని అధికారులను అడిగిన ముఖర్చాడేయడంతో పలువురు నామినేషన్ వేసే ఆశావాహులు బహిరంగంగానే తప్పుపడుతున్నారు. ఓటర్ లిస్టును బహిరంగపరిచి తమ పోటీ చేస్తున్న డైరెక్టర్ పరిధిలోని ఓట్లను చేసుకునే చెక్ చేసుకొనే అవకాశం ఇవ్వాలని తద్వారా ప్రజాస్వామిక విలువలను గౌరవించాలని
డిమాండ్ చేస్తున్నారు