సెహ్వగ్‌ హాప్‌ సెంచరి,ఢిల్లీ 102/ 0

ఢిల్లీ : ఐపీఎల్‌ లో ఢిల్లీ ఆటతీరు ఎట్టకేలకు గాడిన పడింది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఢిల్లీ డేర్‌డేవిల్స్‌ ముంబాయితో పోరులో గాడిన పడ్డారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై 162 పరుగులు చేసి 163 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ ముందుంచగా లక్ష్యఛేదనలో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ ధాటిగా ఆడుతుంది. ఆ జట్టు ఓపెనర్లు వీరెంద్ర సెహ్వాగ్‌ ,మహేల జయవర్దేన జోడి 100పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి జట్టును విజయం వైపు నడిపిస్తున్నారు.స్వేహ్వాగ్‌ 50(31 బంతుల్లోనే ) జయవర్దేన 41 పరుగులతో ఆడుతున్నారు.