సేంద్రియ ఎరువుల వాడకంపై అవగాహన
సిద్దిపేట,మార్చి14(జనంసాక్షి): రైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలని అధికారులు అన్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయం కొనసాగించాలని విస్తృత ప్రచారం నిర్వహించి నప్పటికీ కొంత మంది రైతులు ఇష్టారాజ్యంగా రసాయనిక ఎరువులను వాడుతున్నారన్నారు. దీంతో భూమి నిస్సారంగా మారడంతో పాటుగా తన సహజ స్థితిని కోత్పోతోందనన్నారు. వ్యవసాయ అధికారుల సూచనలు మేరకు విధిగా రసాయనికి ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ సేంద్రియ వ్యవసాయం చేయాలని సూచించారు. ప్రస్తుతం వరి పంటకు ఆగ్గి తెగులు సోకుతున్న నేపథ్యంతో చల్లని వాతావరణంలో పురుగు మందులు పిచికారీ చేయాలని సూచించారు. గ్రావిూణ విత్తనోత్పత్తి పథకంలో భాగంగా రైతులకు సూచనలు చేస్తున్నారు. వరి పంటలో యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. సబ్సిడీపై అధునాతన యంత్రాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


