సేంద్రియ ఎరువుల వాడకం వల్ల కలిగే లాభాలపై రైతులకు అవగాహన
రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి తక్కువ ఖర్చుతో సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలని కేవీకే ఆధ్వర్యంలో గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమం పొందుతున్న ఒడిశా సెంచూరియన్ కళాశాల బియస్సి వ్యవసాయ డిగ్రీ విద్యార్థినులు హర్శిని దివ్య లు శనివారం రోజున గడ్డిపల్లిలో రైతులకు అవగాహన కలిపించారు.అందుబాటులో ఉన్న దేశీ ఆవు పేడ 10 కేజీలు, ఆవు మూత్రం 10 లీటర్లు, బెల్లం 2 కేజీలు, శనగ పిండి 2 కేజీలు, పుట్ట మన్ను 500 గ్రాములు 200 లీటర్ల డ్రమ్ము లో వేసి నీటితో నింపి ఒక కర్రతో సవ్య దిశలో రోజుకు 2-3 పర్యాయాలు తిప్పడం ద్వారా 5 ,6 రోజుల్లో తక్కువ ఖర్చుతో జీవామృతం తయారు చేయవచ్చునని సూచించారు. తదుపరి జీవామృతం ను వివిధ పంటలలో వాడే విధానాలు, జీవామృతం యొక్క ఉపయోగాలను
తెలిపారు.రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించినట్లయితే చీడపీడల సమస్యలు చాలా వరకు తగ్గుతాయని పంట ఆరోగ్యంగా పెరుగుతుందని సేంద్రియ ఎరువుల లాభాల గురుంచి రైతులకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు హర్షిని , దివ్య రైతులు వెంకటయ్య, రాజేష్, సురేష్, సుజాత పాల్గొన్నారు.