సేంద్రియ వ్యవసాయంపై అవగాహన
కామారెడ్డి,నవంబర్1(జనంసాక్షి): సేంద్రియ వ్యవసాయం పురోగమించడానికి రైతులకు అవగాహనతో పాటు, చైతన్యం కల్పిస్తున్నామని కామారెడ్డి ఏడీఏ మహేశ్వరి పేర్కొన్నారు. రైతులు స్వయంగా నమ్మితే గాని ముందుకు రారని అందుకే వారికి భరోసా కలిగేలా కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. సేంద్రియ వ్యవసాయం, వర్మి కంపోస్టు ఎరువుతో పాటు వేప నూనె, వేప కషాయం తయారీ విధానాన్ని వివరిస్తున్నా మని అన్నారు. రైతులకు పూర్తి రాయితీపై సేంద్రియ ఎరువులను అందజేస్తున్నామని చెప్పారు. సేంద్రియ సాగుతోనే రైతు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తారని అన్నారు. ఇదిలావుంటే వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కృషి వికాస్ యోజన కార్యక్రమంలో 50 మంది రైతులను గుర్తించి వారికి శిక్షణ ఇచ్చారు. ఇందులో భాగంగా సేంద్రియ సాగు మెళకువులను అందించారు.