సేవాలాల్ మరియమ్మ జయంతికి ఆహ్వాన పత్రిక అందజేత బషీరాబాద్
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని జీవన్గీ గ్రామంలో జరుగుతున్న సేవలల్ మరియమ్మ మొదటి జయంతి ఈ నెల 27,28,29 తేదీలలో ఘనంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తండ్రి టిఆర్ఎస్ సీనియర్ నాయకులు విట్టల్ రెడ్డిని హైదరాబాదులో తన నివాసంలో చేరుకొని జీవన్గీ గ్రామస్తులు ఆహ్వానం పత్రికను అందజేసీ,పూల మాల వేసి, శాలువలతో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు విట్టల్ రెడ్డికి ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బషీరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాండురంగ గుప్తా, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాణిక్ రెడ్డి,గోపి,విటల్, గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.