సేవాలాల్ సేన 8వ ఆవిర్భావ సభను జయప్రదం చేయండి

–జిల్లా ప్రధాన కార్యదర్శి ధరావత్ సురేష్ నాయక్

టేకులపల్లి, సెప్టెంబర్ 4( జనం సాక్షి): సేవాలాల్ సేన ఎనిమిదవ ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని సేవాలాల్ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి ధరావత్ సురేష్ నాయక్ కోరారు. ఆదివారం టేకులపల్లి మండల కేంద్రంలో సేవాలాల్ సేన మండల అధ్యక్షులు బానోతు నాగరాజు నాయక్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సేవాలాల్ సేన 8వ ఆవిర్భావ సభ 09 -09- 2022 శుక్రవారం నాడు ధనుంజయ గార్డెన్ ఫంక్షన్ హాల్ హయత్ నగర్ హైదరాబాద్ యందు జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సేవాలాల్ సేన ఆవిర్భావ కరపత్రాలను ఆవిష్కరించారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో అన్ని వర్గాలకు సమానత్వం కావాలని రాజ్యాంగం రచించిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో గిరిజనులకు రాజ్యాంగంలో కల్పించబడిన హక్కుల సాధనే లక్ష్యంగా గోర్ బంజారా సంప్రదాయ సంస్కృతిని సేవాలాల్ సేన కాపాడుతూ వస్తుందని, గిరిజన హక్కులపై ప్రభుత్వాలతో పోరాటం చేస్తూ వస్తుందని గిరిజన జాతి హక్కుల సాధనకై సేవాలాల్ సేన సైనికులు రాష్ట్రవ్యాప్తంగా అలుపెరుగని పోరాటాలు చేస్తూ ఉన్నారని అన్నారు. గిరిజన జనాభా దామాస ప్రకారం 10% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని, గిరిజనులు దున్నుకుంటున్న పోడు భూములకు పట్టాలివ్వాలని, గిరిజన రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజన తండా పంచాయతీలను రెవెన్యూ పంచాయతీలుగా గుర్తించి గిరిజన తండా అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేయాలని, గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ను ఏర్పాటు చేయాలని, ఇల్లు లేని ప్రతి గిరిజన కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వెంటనే మంజ�