సైజింగ్‌ కార్మికుడి అనుమానాస్పద మృతి

సిరిసిల్ల : పట్టణంలోని కార్గిల్‌ లేక్‌లో పడి సైజింగ్‌ కార్మికుడు మృతి చెందాడు. గోపాల్‌ నగర్‌కు చెందిన గూడెపు శ్రీనివాస్‌ (35) అనే కార్మికుడు ఈ ఉదయం లేక్‌లో శవమైతేలాడు. ఆదివారం నుంచి శ్రీనివాస్‌ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యుడు గాలింపు చేపట్టారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.