కరీంనగర్: సైదాపూర్ తహసీల్దార్‌గా ఏ.రామాదేవి మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సైదాపూర్ తహసీల్దార్‌గా పని చేసిన కిరణ్‌కుమార్ ఇటీవల పెద్దపెల్లికి బదిలీపై వెళ్లారు. దీంతో ఆయన స్థానంలో వరంగల్ జిల్లాకు చెందిన తహసీల్దార్ రమాదేవిని నియమిస్తూ కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆమె బాధ్యతలు చేపట్టారు.