సైద్దాంతిక నిబద్దత లేని పార్టీలు
కాంగ్రెస్‌ను వీడడానికి అదే కారణం
అధికారమే నేటి తరం నేతల సిద్దాంతం
న్యూఢల్లీి,సెప్టెంబర్2 జనం సాక్షి : దేశంలో ఇప్పుడు రాజకీయ పార్టీల్లో ఉంటున్న నాయకులకు సిద్దాంత పరమైన బంధం ఉండడం లేదు. ఎప్పుడు రాజకీయ అసవరం ఉంటే అప్పుడే ఇతర పార్టల్లోకి జంప్ అవుతున్నారు. ఒక్క కమ్యూనిస్టుల్లోనే కొంత నిబద్దత ఉన్నా..ఆ పార్టీలోనూ ఇప్పుడు అలాంటి ఛాయలు కానరావడం లేదు. జాతీయ పార్టీల్లో కమ్యూనిస్టు, భారతీయజనతాపార్టీ మాత్రమే సిద్దాంతపరమైన భావజాలంతో కొనసాగుతున్నాయి. భారతీయ జనతా పార్టీకి ఒక సిద్దాంతం ఉంది. అందులో నేతలు ఎవరైనా దాని చుట్టూ తిరగడం వల్లనే అందులోని నాయకులు పెద్దగా బయటకు పోయిన దాఖలాలు లేవు. పోయినా తక్కువమందే. వారంతా సిద్ధాంతాలతో ఉన్నావారు కాదు. అంతకు ముందు జనసంఫ్‌ు ఎంత దుస్థితిలో ఉన్నా, ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా నేతలు తమ పార్టీని విడిచిపెట్టిన దాఖలాలు లేవు. ఓడిపోయిన కొద్దీ మరింత సమరోత్సాహంతో ఆ పార్టీ నేతలు పోరాడుతూనే వచ్చారు. కనుకనే ఇవాళ అది అధికారంలో పాతుకుపోతోంది. ఇందుకు ప్రధాన కారణం ఆ పార్టీ తన సైద్దాంతిక పునాదిని పటిష్ఠంగా ఉంచుకునే ప్రయత్న చేయడమే. కమ్యూనిస్టు పార్టీలు కూడా లెక్కలేనన్ని సార్లు ఎన్నికల్లో ఓడిపోయా యారు. 2004 తర్వాత నుంచి ఆ పార్టీల సంఖ్యాబలం పడిపోతూనే ఉంది. అనేక రాష్టాల్ల్రో అధికారం కోల్పోయారు. కేరళలో మాత్రమే ఇప్పుడు అధికారంలో ఉన్నారు. అయినా వారు వెరవకుండా మళ్లీ
నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అయినా ఆ పార్టీల నేతలు తమ పార్టీని వదిలిపెట్టి వెళ్లారన్న వార్తలు చాలా తక్కువ సందర్భాల్లో మనకు వినపడతాయి. ఎక్కడో కొద్దిమంది తప్ప కమ్యూనిస్టులు కూడా బలమైన భావజాలంతో ముందుకు సాగుతారు. అవసరమైతే వారంతా ఒక్కటి కాగలరు. కానీ కాంగ్రెస్ పార్టీలో అలా కనిపించు. కేవలం పదవీ లాలస తప్ప అందులో పార్టీ సిద్దాంతాల రాద్దాంతం లేదు. అధికారంలో కోల్పోతే చాలు ఆ పార్టీ నేతలు తమ పార్టీ నాయకత్వాన్ని దూషించి ఇతర పార్టీల్లోకి దుంకేస్తారు. ఒకప్పుడు ఇందిర,రాజీవ్ హయాంలో పార్టీకి కొంత ఆకర్శణశక్తి కూడా ఉండేది. నెహ్రూ కుటుంబం అన్న బంధం ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఎందుకంటే సోనియా తరం దాదాపుగా ముగిసినట్లుగానే చెప్పుకోవాలి. రాహుల్, ప్రియాంకలు పార్టీని గట్టెక్కించే సత్తా లేదని నిరూపితం అయ్యింది. దీనికితోడు కొత్త జనరేషన్ ప్రజలకు వారి గురించి పెద్దగా తెలియదు. అందుకే ఇక్కడ ఉన్న నేతలు ఇతర పార్టీలోకి వెళ్లి పబ్బం గడుపుకోవాలని లేదా ఇతర ప్రలోభాలకు లోబడి నిర్ణయాలు తీసుకుంటున్నారు. తమకు అధికారం లేకపోతే చాలు అసమ్మతి వాదులుగా తయారవుతారు. ఇటీవల ఆ పార్టీలో ఉన్న సీనియర్లు ఒక్కక్కరుగా బయటకు వస్తున్న తీరు చూస్తుంటే సిద్దాంతపరమైన బంధం లేకపోవడమే కారణంగా చూడాలి. వారిని కలిపి ఉంచేది అధికారమే తప్ప మరోటి కాదు. కేంద్రంలో అయినా, రాష్ట్రంలో అయినా పార్టీ నేతలు తమకు ఎప్పుడు ఏది అవసరమో అది మాత్రమే చేస్తారు. కాబట్టే కపిల్ సిబల్ వెళ్లి,జ్యోతిరాదిత్య సిందియా,గులామ్ పబీ ఆజాద్ లాంటి వారంతా వెళ్లిపోయారు. సచిన్ పైలట్ వెళ్లబోతూ ఆగారు. వీరంతా కూడా కేవలం రాజ్యసభ పదవులో లేదా బయట స్వలాభం ఉండో వెళ్లారే తప్ప సిద్దాంతపరమైన విభేదాలతో కాదని గుర్తించాలి. అలాగే కపిల్ సిబల్ సమాజ్‌వాదీతో జతకట్టి రాజ్యసభ పొందారు. జ్యోతిరాదిత్య కూడా బిజెపిలో చేరి కేంద్రమంత్రి అయ్యారు. ఇప్పుడున్న నేతలక కూడా పదవులు ఇవ్వకుంటే వారు కూడా వెళ్లి పోవడం ఖాయం. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ స్థాయికి రావడానికి ఎన్నో ఏళ్లు పట్టింది. బిజెపి పూర్వరూపమైన జనసంఫ్‌ు 1952 ఎన్నికల్లో కేవలం 3 సీట్లు మాత్రమే గెలుచుకుంది. 1957లో అటల్ బిహారీ వాజపేయి మూడు సీట్లకు పోటీ చేస్తే రెండు సీట్లలో ఓడిపోయారు. పడుతూ లేస్తూ వస్తూనే జనసంఫ్‌ు ఎమర్జెన్సీ తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో 93 సీట్లను గెలుచుకుంది. ఇదే జనసంఫ్‌ు 1980లో బిజెపిగా రూపాంతరం చెందినప్పటికీ 1984లో ఇందిర మరణానంతరం వెలువడిన సానుభూతి పవనాలకు తట్టుకోలేక కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంది. బిజెపి తొలి అధ్యక్షుడైన వాజపేయి కూడా గ్వాలియర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బిజెపి వైఫల్యానికి పార్టీ అధ్యక్షుడుగా తాను బాధ్యత వహించి రాజీనామా చేస్తానని అటల్‌జీ అన్నప్పటికీ పార్టీ ఒప్పుకోలేదు. కానీ రెండు సంవత్సరాల తర్వాత జరిగిన జాతీయమండలి ప్లీనరీలో వాజపేయి తప్పుకుని అడ్వాణీని అధ్యక్షుడుగా ఎన్నుకునేందుకు మార్గం సుగమం చేశారు. ఒకప్పుడు కేవలం రెండు సీట్లు గెలుచుకున్న బిజెపి 1989లో 86 సీట్లు గెలుచుకున్న తర్వాత దినదిన ప్రవర్థమా నమవుతూ వచ్చింది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయగల దశ నుంచి పూర్తి మెజారిటీ సాధించగల స్థాయికి బిజెపి చేరుకుంది. చివరకు నరేంద్ర మోదీ సారథ్యంలో రెండుసార్లు లోక్‌సభలో ఘన విజయం సాధించడమే కాక, దేశంలో అనేక రాష్టాల్ల్రో అధికారంలోకి రాగలిగింది. ఇదంతా సైద్దాంతిక ప్రాతిపదికన మాత్రమే జరిగింది. కాంగ్రెస్‌లో సైద్దాంతికత లేకపోవడం వల్లనే నేతలు పార్టీని వీడుతున్నారు.