సైనాను అభినందించిన రాష్ట్రపతి, సీఎం కేసీఆర్‌

4
హైదరాబాద్‌ ఆగష్టు 16 (జనంసాక్షి):

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ మహిళల సింగిల్స్‌లో రజత పతకం సాధించిన సైనా నెహ్వాల్‌ను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అభినందించారు. ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ టోర్నీలో శనివారం జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ షట్లర్‌గా సైనా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు భారత్‌ ఖాతాలో ఒక్క రజత పతకం కూడా లేని లోటును సైనా భర్తీ చేసింది. ఆదివారం జరిగిన ఫైనల్‌ పోరులో సైనా ఓడిపోయి రజిత పతకంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. భారత్‌కు తొలి రజతాన్ని అందించినందుకు భారత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమెకు అభినందనలు తెలిపారు. వెరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌ టోర్నీలో రజతం సాధించిన సైనా నెహ్వాల్‌కు సీఎం కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. మెగాటోర్నీలో సైనా పోరాట పటిమపై ప్రశంసల జల్లు కురిపించారు. సైనా ఘనత పట్ల తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉనట్లు సీఎం కేసీఆర్‌ తెలిపారు. సైనా విజయాలు అమ్మాయిలు అన్ని రంగాల్లో ముందడుగు వేయడానికి దోహదపడ్డాయని సీఎం తెలిపారు.