సైనా జోరుకు బ్రేక్‌ – సెమిస్‌లో ఓడిన హైదరాబాదీ ఇక క్యాంసం కోసం పొరాటం

లండన్‌ ,ఆగస్టు 3: లండన్‌ ఒలింపిక్స్‌ లో భారత స్టార్‌ షట్లర్‌ సైనానెహ్వల్‌ జోరుకు బ్రేక్‌ పడింది. సెమీ ఫైనల్‌ లో ఒక్క సెట్‌ కూడా కోల్పోని ఈ హైదరాబాద్‌ షట్లర్‌ సెమిస్‌లో మాత్రం ఒత్తిడికి లోనైంది. గతంలో సైనా పై రికార్డు కలిగిన యి వాస్‌ వాంగ్‌ అదే జోరును కనబరిచింది. మ్యాచ్‌ ప్రారంభం నుండే ఆధిక్యంలో నిలిచింది. దీనికి తోడు గత మ్యాచ్‌లతో పోలిస్తే సైనా అనవసర తప్పిదాలు కూడా ఈ అధిక్యానికి కారణమయ్యాయి. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో అత్యుత్తమ క్రీడాకారిణిగా పేరున్న వాంగ్‌ వ్యూహత్మకంగా ఆడింది.పాయింట్‌ పాయింట్‌కూ గేమ్‌ ప్లాన్‌ మారుస్తూ అధిపత్యం కనబరిచింది. మొదటి సెట్‌ను వాంగ్‌ 21-13 తో గెలుచుకుంది. అయితే రెండో సెట్‌లో కాస్త మెరుగ్గా ఆడిన సైనా ఆధిక్యం సాధించినా .. దానిని నిలుపుకోవడంలో ఒత్తిడికి లోనైంది. అనవసర తప్పిదాలతో వెనుకబడింది. ఇదే సమయంలో వాంగ్‌ తన దైన శైలిలో దూసేకెళ్ళింది. 21-13 తో సెట్‌తో పాటు మ్యాచ్‌నూ గెలుచుకుని ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. వాంగ్‌ చేతిలో ఓడిపొవడం సైనా కిది వరుసగా ఆరోసారి.మ్యాచ్‌లో కొన్ని షాట్ల దగ్గర సైనా అంచనాలు తప్పవడం కూడా ప్రభావం చూపింది.ఈ ఓటమితో స్వర్ణం,రజతం గెలిచే అవకశం కోల్పొయిన సైనానెహ్వల్‌ క్యాంసం కోసం పొటిపడనుంది. మరో సెమీస్‌లో తిరిగి రావాలని హైదరాబాదీ షట్లర్‌ భావిస్తోంది.