సైనిక తిరుగుబాటును తిప్పికొట్టిన ప్రజలు

56

– టర్కీలో తొకముడిచిన సైన్యం

– అదుపులోకి వచ్చిన పరిస్థితి

– దాడుల్లో వందమంది మృతి

అంకారా,జులై 16(జనంసాక్షి):  టర్కీలో శనివారం  సైన్యం తిరుగుబాటును ప్రభుత్వం కఠినంగా అణచివేసింది. కొన్నిగంటల్లోనే సైన్యం నుంచి దేశాన్ని కాపాడుకున్నారు. ప్రజల పోరాటం ఫలించడంతో  టర్కీలో సైనిక కుట్ర భగ్నమైంది. ప్రజల తిరగబడడంతో సైన్యం వెనక్కి తగ్గింది. ఎక్కడికక్కడ సైనికులను ప్రజలు బంధిస్తున్నారు. ఇప్పటివరకు 336 మంది సైనికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే తిరుగుబాటుకారణంగా సైన్యం జరిపిన కాల్పుల్లో కనీసం వందమంది మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు.  అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు సైన్యంలోని ఓ వర్గం టర్కీలో తిరుగుబాటుకు యత్నించింది. దీంతో టర్కీ రణరంగంగా మారింది. దేశాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సైన్యం ప్రకటించినా.. ఆతర్వాత కొద్దిసేపటికే పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు టర్కీ ప్రధాని వెల్లడించారు. దీంతో దేశ వ్యాప్తంగా మార్షల్‌ చట్టం, కర్ఫ్యూ విధించారు. రాజధాని అంకారా గగనతలంలో సైనిక విమానాలు, హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి. ఇస్తాంబుల్‌, అంకారా తదితర ప్రధాన పట్టణాల్లో సైనిక ట్యాంకులు తిరిగాయి. పార్లమెంట్‌ భవనం సవిూపంలోని పలు కీలక ప్రాంతాల్లో సైన్యం పేలుళ్లకు పాల్పనట్లు స్థానిక విూడియా తెలిపింది. సైన్యంలో తిరుగబాటు దారులను బందించారు. కొత్త సైన్యాధ్యక్షుడని నియమించారు. నిరంకుశ పాలన, పెరిగిన ఉగ్రవాదం కారణంగానే అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని భావించినట్లు సైన్యంలోని ఓ వర్గం వెల్లడించింది. టర్కీ అధికారిక ఛానల్‌, రేడియా కార్యాలయాలను స్వాధీనం చేసుకునేందుకు సైనిక అధికారి, నలుగురు సైనికులు విఫలయత్నం చేశారు. తీవ్రంగా ప్రతిఘటించిన పోలీసులు సైనిక అధికారి, నలుగురు సైనికులను హతమార్చారు. తిరుగుబాటుకు యత్నించిన ఒక జనరల్‌ను పోలీసులు హతమార్చారు. మరో 754 మంది సైనికులను అదుపులోకి తీసుకున్నారు. ఇస్తాంబుల్‌లోని టక్‌సిమ్‌ స్క్వేర్‌ వద్ద పోలీసులు, సైన్యం మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు మృతి చెందారు. సైన్యం జరిపిన దాడుల్లో ఇప్పటి వరకూ 17మంది పోలీసులు సహా 90 మంది మృతిచెందారు. తిరుగుబాటు చేసిన సైన్యం ఉపయోగించిన యుద్ధవిమానాన్ని వెంటనే కుప్పకూల్చాలని టర్కీ సైన్యానికి ప్రధాని ఆదేశాలు జారీ చేశారు. సైనిక తిరుగుబాటును టర్కీ అధ్యక్షుడు ఎర్డొగాన్‌ ఖండించారు. ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. అధ్యక్షుడి పిలుపుమేరకు దేశ ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి సైనిక చర్యపై నిరసన తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని ప్రధాని ప్రకటించారు. పోలీసుల అదుపులో 754మంది సైనికులు ఉన్నారని, ఒక జనరల్‌ను పోలీసులు హతమార్చినట్లు ప్రధాని వెల్లడించారు. రాజధాని ఆంకారాలో సైనిక విమానాలు, హెలికాప్టర్లతో పహారా కాస్తున్నారు. హెలికాప్టర్ల నుంచి సైనికులు జరిపిన కాల్పుల్లో 17మంది పోలీసులు సహా 42 మంది మృతి చెందారని తొలి సమాచారం అందింది. మరో వైపు సైన్యంతో టర్కీ ప్రభుత్వం చర్చలు జరుపుతోందని తెలుస్తోంది.  ఇప్పటి వరకూ 130 మంది సైనికులను అదుపులోకి తీసుకున్నట్లు టర్కీ ప్రధాని వెల్లడించారు. ఇస్తాంబుల్‌లోని టక్‌ సిమ్‌ స్క్వేర్‌ వద్ద పోలీసులు, సైన్యం మధ్య కాల్పులు కొనసాగాయి. పలు చోట్ల భారీ పేలుళ్లు సంభవించినట్లు టర్కీ విూడియా వెల్లడించింది. ప్రస్తుతం టర్కీలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. దేశ అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు సైన్యంలోని ఓ వర్గం దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది.అయితే సైన్యంలోని ఓవర్గం తిరుగుబాటును తిప్పికొట్టామని టర్కీ వెల్లడించింది. దేశాన్ని హస్తగతం చేసుకునేందుకు సైన్యంలోని ఓ వర్గం చేసిన ప్రయత్నం విఫలమైందని.. టర్కీలో పరిస్థితి అదుపులోనే ఉందని టర్కీ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి ఎదురు తిరిగిన సైన్యం ప్రయత్నాన్ని టర్కీ ప్రజలు ఐకమత్యంతో ఎదుర్కొన్నారని ప్రకటనలో పేర్కొన్నారు. సైనిక తిరుగుబాటుతో ఇప్పటి వరకు 90మంది మృతి చెందినట్లు సమాచారం.తిరుగుబాటు దారులను పోలీసులు, మిగతా సైన్యం అణిచివేసేందుకు ప్రయత్నించి సక్సెస్‌ అయ్యిందని దేశాధ్యక్షుడు వెల్డించారు. పార్లమెంటు భవనం, పలు కీలక ప్రాంతాల్లో తిరుగుబాటు సైన్య వరుస దాడులకు పాల్పడింది. టర్కీ అధ్యక్ష నివాసంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన 13 మంది సైనికులను పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు సీనియర్‌ అధికారి తెలిపారు. తిరుగుబాటుకు ప్రయత్నించిన సైనికుల్లో 754 మందిని పోలీసులు అదుపుపులోకి తీసుకున్నట్లు టర్కీ ప్రధానమంత్రి వెల్లడించారు. తిరుగుబాటు దారులు ఉపయోగిస్తున్న సైనిక విమానాలను కూల్చేయాలని ప్రధాని ఆదేశించారు. తిరుగుబాటుకు యత్నించిన సైనికుల్లో 50 మంది బోస్ఫెరస్‌ బ్రిడ్జ్‌పై లొంగిపోయారు. మరికొందరు టక్సిమ్‌ స్క్వేర్‌ వద్ద లొంగిపోయినట్లు సమాచారం. సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా టర్కీ అధ్యక్షుడి పిలుపు మేరకు లక్షలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. తిరుగుబాటును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఇస్తాంబుల్‌ చేరుకున్న అధ్యక్షుడు పరిస్థితి అదుపులోనే ఉందని ప్రకటించారు. ఇస్తాంబుల్‌లోని అటాటర్క్‌ విమానాశ్రయం ఆర్మీ ఆధీనంలోకి వచ్చింది. కొన్ని గంటల పాటు విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. విమానాశ్రయంలో తిరిగి విమాన సేవలను పునరుద్ధరించారు. టర్కీలో సైనిక తిరుగుబాటు నేపథ్యంలో భారతీయులెవరూ టర్కీ వెళ్లొద్దని విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ ప్రకటించారు. సాధారణ పరిస్థితి నెలకొనే వరకూ టర్కీలో ఉన్న భారతీయులెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. టర్కీ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు ఒబామా విదేశాంగశాఖ మంత్రి జాన్‌ కెర్రీతో చర్చించారు. సైనిక చర్యను ఖండించిన ఒబామా.. ప్రజాస్వామ్య బద్దంగా ఏర్పడిన ప్రభుత్వానికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు

టర్కీలో భారతీయ క్రీడాకారులు క్షేమం

వరల్డ్‌ స్కూల్‌ గేమ్స్‌-2016లో పాల్గొనేందుకు టర్కీ వెళ్లిన 148 మంది భారతీయ క్రీడాకారిణులు టర్కీలో చిక్కుకు పోయారు. అయితే వీరంతా క్షేమంగా ఉన్నారని విదేశాంగ శాఖ ద్వారా తెలియచేసింది. టర్కీ వెళ్లిన భారత క్రీడాకారిణులంతా క్షేమంగా ఉన్నారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈమేరకు భారత క్రీడాశాఖ మంత్రి విజయ్‌ గోయెల్‌ వెల్లడించారు. టర్కీలోని భారత రాయబారితో తాను మాట్లాడానని తెలిపారు. టర్కీలో సైనిక చర్య విఫలమైనందున తిరిగి స్కూల్‌ గేమ్స్‌ కొనసాగనున్నట్టు వెల్లడించారు. క్రీడలు జరిగే చోటు ఇస్తాంబుల్‌కు చాలా దూరంలో ఉందని వివరించారు. అయితే  తమను టర్కీ నుంచి సురక్షితంగా స్వదేశానికి తీసుకెళ్లాలని భారత ప్రభుత్వాన్ని క్రీడాకారిణులు కోరారు. పోటీల్లో గెలవడం ముఖ్యమే అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము ఇక్కడ ఉండలేమని, తమను ముందు భారత్‌కు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు వాళ్లు మాట్లాడుతున్న వీడియోను వాట్సాప్‌ ద్వారా పంపించారు. జులై 11న టర్కీలోని ట్రాబ్‌జన్‌ రాష్ట్రంలో ఈ గేమ్స్‌ ప్రారంభమయ్యాయి. జులై 18 వరకు కొనసాగనున్నాయి. అయితే తాము ప్రస్తుతం ట్రాజ్‌బన్‌ రాష్ట్రంలో సురక్షితంగా ఉన్నామని, గేమ్స్‌ ముగియగానే టర్కీ వెళ్లి భారత్‌ చేరుకునేందుకు ప్రభుత్వం సహకరించాలని కోరారు.