సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ కు రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి

హుజూర్ నగర్ డిసెంబర్ 12 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ కు రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలైన అమరవరం, లింగగిరి, బూరుగడ్డ, కరక్కాయల గూడెం, హుజూర్ నగర్ పట్టణంలోని గర్ల్స్ హై స్కూల్, బాయ్స్ హై స్కూల్ కు హుజూర్ నగర్ జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, జిల్లా పరిషత్ నిధుల నుండి ప్రతి స్కూలుకు ఒక లక్ష రూపాయల విలువైన సైన్స్ పరికరాలను స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి చేతుల మీదుగా వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులుకు అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో లాబ్స్ అభివృద్ధికి నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. సైన్స్ ల్యాబ్స్ ఉపయోగించుకొని తరగతి బోధన చేయాలన్నారు. ఉపాధ్యాయులు, పిల్లలకు పాఠశాల స్థాయిలోనే శాస్త్రీయ దృక్పథాన్ని సృజనాత్మకతను పెంపొందించేలా కృషి చేయాలన్నారు. మన ఊరు మనబడి ద్వారా పాఠశాలలో అదనపు గదులు నిర్మాణం మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో 1000 పైగా గురుకులాలు, 500 పైగా కేజీబీవీ పాఠశాలలు, 200 పైగా మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేసిందన్నారు. విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. హజూర్ నగర్ నియోజకవర్గంలో పాఠశాలలకు, అంగన్వాడి కేంద్రాలకు మౌలిక వసతులు కల్పనకు తన సిడిపి నిధుల ద్వారా నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, సర్పంచులు సుజాత అంజిరెడ్డి, కర్నాట అంజిరెడ్డి, షేక్ సలీమారంజాన్, జయమ్మధన మూర్తి, ఎంపీటీసీ సభ్యులు వల్లభనేని విజయలక్ష్మి, కాశమ్మ, సర్వయ్య, టిఆర్ఎస్ నాయకులు అలీ, బెల్లంకొండ అమర్, ప్రధనోపాధ్యాయులు పెనుగొండ శ్రీనివాస్, ఉదయశ్రీ, నలబోలు శ్రీనివాస్ రెడ్డి, బీరం శ్రీనివాస్ రెడ్డి, అబ్దుల్ లతీఫ్, నరసయ్య, శ్రీనివాస్, ప్రభాకర్ రావు, వసంతరావు తదితరులు పాల్గొన్నారు.