సైబర్ క్రైమ్, ఉమెన్ సేఫ్టీ, షీ టీమ్స్ లపై అవగాహన
జనంసాక్షి, కమాన్ పూర్ : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జోన్ కమాన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ హై స్కూల్ కమాన్ పూర్ లో విద్యార్థినిలకు సైబర్ క్రైమ్, ఉమెన్ సేఫ్టీ, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, గుడ్ టచ్ , బ్యాడ్ టచ్ , అమ్మాయిలను వేధింపులు, చదువుపై శ్రద్ధ, సెల్ ఫోన్ వినియోగం వల్ల ఏర్పడే అనార్థాలు మొదలగు విషయాలపై రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్., (డిఐజి) ఆదేశాలు మేరకు అవగాహన కార్యక్రమం కమాన్ పూర్ బేతి రాములు ఆధ్వర్యంలో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ఐ రాములు మాట్లాడుతూ… అమ్మాయిల ని ఎవరైనా వేధింపులకు గురి చేసిన ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ చేసినట్లు అయితే వెంటనే షి టీం పోలీసులకు ధైర్యంగా ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని అని సూచించారు. ఏటువంటి విషయాలు ఉన్న తల్లిదండ్రుల ద్యారా ధైర్యంగా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. విద్యార్థినిలు నేటి కాలంలో సెల్ ఫోన్ వినియోగం ఎక్కువైంది చాలామంది సోషల్ మీడియాకు అలవాటుపడి సమయాన్ని వృధా చేసుకోవడం జరుగుతుంది. కావున విద్యార్థినిలు విద్యార్థి దశలో సెల్ ఫోన్ వినియోగం తగ్గించుకుని చదువుపై శ్రద్ధ కనబరచాలని సూచించారు. విద్యార్థులు చిన్నతనం నుండే చదువుపై శ్రద్ధ కనబరచాలి. చదువుతూనే ఏదైనా సాధించవచ్చు అని ఉద్యోగాల్లో ఉన్నత స్థితిలో ఉంటారని తెలిపారు. ఉన్నత ఆశయాలు చదువులో ముందంజ సమాజంలో రేపు గొప్ప పౌరులుగా తీర్చి దిద్దడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. విద్యార్థినీ విద్యార్థులకు యుక్త వయస్సు లో తాత్కాలిక ఆనందాల కోసం ఆకర్షణలకు ప్రలోభాలకు గురై భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని, క్రమశిక్షణ, పట్టుదల తో సామర్థ్యం, బాధ్యతతో పనులు నిర్వహించుకోవడం,పెద్దలను తల్లితండ్రులను గౌరవించడం మొదలగు విషయాలను అలవర్చుకోవాలని, స్కూల్లో, కాలేజీలలో, బస్టాప్ లో, నిర్మానుష్య ప్రాంతాల్లో అమ్మాయిలను ఎవరైనా వేధింపులకు గురి చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ,విద్యార్థి విద్యార్థినులు వారు పాల్గొన్నారు.