సైబర్ నేరాల పై అవగాహనా సదస్సు.పోస్టర్ల విడుదల
నిర్మల్ బ్యూరో, జూన్11,జనంసాక్షి,, ప్రతి రోజు సమాజం లో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహనా కల్పించాలనే ఆలోచనతో రాష్ట్ర పోలీసు అధికారులు ఒక టోల్ ప్రీ నెంబర్ ప్రవేశ పెట్టడం జరిగింది మరియు దిని పట్ల ప్రజలకు అవగాహనా కల్పించాలని సూచించడం జరిగింది. దిని లో బాగంగా ఈ రోజు తేది.11.06.2022 రోజున ఉదయం.1100 గంటలకు నిర్మల్ డిఎస్పి గారి కార్యాలయంలో DSP జీవన్ రెడ్డి గారి అధ్వర్యంలో టోల్ ప్రీ నెంబర్. 1930 పోస్టర్స్ విడుదల చేయడం జరిగింది, మరియు ప్రజలకు DSP జీవన్ రెడ్డి గారు కొన్ని ముఖ్య మైన సూచనలు చేశారు
……………ఎవరికైనా ఏదైనా గుర్తు తెలియని నంబర్స్ అనగా ఫేక్ ఫోన్ కాల్స్ వస్తే తమరు లిఫ్ట్ చేయకండి, వారు బ్యాంకు సిబ్బంది అని మీ యొక్క ATM కార్డు బ్లాకు అయినది అని OTP లను పంపించి వాటిని చెప్పమని కోరుతాడు, ఒక వేల తను అడిగిన సమాచారం మనం ఇస్తే మన ఎకౌంటు లో ఉన్న డబ్బులు అతను దొంగిలిస్తాడు మరియు ఎవరినా సైబర్ నేరాలలో డబ్బులు పోగుట్టుకుంటే వెంటనే టోల్ ప్రీ నెంబర్.1930 కి కాల్ చేసి తమ వివరాలు తెలుపాలని కోరారు.
ఈకార్యక్రమంలో నిర్మల్ టౌన్ మరియు రూరల్ CI లు మరియు SI లు పాల్గొన్నారు.