*సొంత నిధులతో చీరల పంపిణీ*
* హర్షం వ్యక్తం చేసిన అంగన్వాడీ టీచర్లు ఆశా మరియు ఆర్ పి లు
కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) సెప్టెంబర్ 27 :- విధి నిర్వహణలో భాగంగా నిత్యం ప్రజలకు సేవలు అందించే అంగన్వాడీ టీచర్లకు ఆశ మరియు ఆర్పి లకు సొంత డబ్బులతో చీరలు పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా ఆయన సతీమణి రెడ్డి శెట్టి నాగరాణి అన్నారు తెలంగాణ స్త్రీ జాతి మొత్తం తొమ్మిది రోజులు అవధులు లేని ఆనందంతో నిర్వహించుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా మంగళవారం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా ఆయన సతీమణి రెడ్డి శెట్టి నాగరాణిలు అంగన్వాడి టీచర్లకు ఆశ మరియు ఆర్పీలకు వారి సొంత నిధులతో చీరలను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ మహిళ లోకం అత్యంత ఉత్సాహంతో జరుపుకునే బతుకమ్మ పండుగ రోజు అమ్మలక్కలు ఆడపడుచులు ఎవరు అసంతృప్తికి గురి కావద్దనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చీరల పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ మహిళలందరూ ఎంతో హర్షించదగ్గ విషయమని అన్నారు ఇప్పటివరకు తెలంగాణ ఆడపడుచుల కళ్ళల్లో బతుకమ్మ పండుగ రోజు ఆనందాన్ని చూడాలనే ఆలోచనతో ఏ ప్రభుత్వం బతుకమ్మ పండుగ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన దాఖలాలు లేవని గుర్తు చేశారు ఇదే సందర్భంగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న రెండు లక్షల పైచిలుకు జనాభాకు అహర్నిశలు సేవలందిస్తూ ప్రజల ఆనందాన్ని వారిలో చూసుకుంటున్న అంగన్వాడీ టీచర్లు ఆశ మరియు ఆర్పి లకు చీరలు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో వారికి చీరలు పంపిణీ చేయడం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యులు టిఆర్ఎస్ నాయకి మనులు అంగన్వాడీ టీచర్లు ఆశా మరియు ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు
Attachments area