సొంత నిధులతో బోర్వెల్ వేయించిన మజ్లిస్ పార్టీ నాయకుడు
జహీరాబాద్ అక్టోబర్ 12 (జనంసాక్షి ) ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షులు, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ, కార్వాన్ శాసనసభ్యులు సంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జ్ కౌసర్ మొహియుద్దీన్ ఆదేశాల మేరకు జహీరాబాద్ శాంతినగర్ వార్డు లో మాజీ వైస్ ఛైర్మన్ అజ్మత్ పాషా సొంత డబ్బుతో బోర్‌వెల్ వేయించారు. బోర్ లో నాలుగు అంగుళాల నీరు వచ్చిందన నీటి కొరతతో చుట్టుపక్కల ప్రజలు నానా అవస్థలు పడుతుండడం చూసి మాఙి వైస్ ఛైర్మన్ అజ్మత్ పాషా బోర్ వేయించారు. తర్వాత జహీరాబాద్ మజ్లిస్ పార్టీ అధ్యక్షులు అత్తర్ అహ్మద్ మాజీ వైస్ ఛైర్మన్ అజ్మత్ పాషా తో కలిసి పురపాలక సంఘం కార్యాలయానికి చేరుకుని పంపుసెట్ల నిర్వహణ, పనులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ సుభాష్‌రావు దేశ్‌ముఖ్‌కు విన్నవించారు ఈ బోర్‌వెల్‌కు పురపాలక శాఖ నుంచి మెుటర్, స్టాటర్ మంజూరు చేసిన పురపాలక సంఘం కమిషనర్ సుభాష్‌రావు దేశ్‌ముఖ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ బోర్‌వెల్‌ను జహీరాబాద్ మజ్లిస్ పార్టీ అధ్యక్షులు ముహమ్మద్ అత్తర్ అహ్మద్, అజ్మత్ పాషా ప్రారంభించారు మజ్లిస్ పార్టీ నాయకులకు శాంతినగర్ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా జాయింట్ సెక్రటరీ ఆమెర్ బిన్ అబ్దుల్లా, వివిధ వార్డుల అధ్యక్షులు మహ్మద్ అయూబ్, సయ్యద్ రాషెద్, మహమ్మద్ యూనుస్, స్థానిక ప్రజలు మహమ్మద్ కరీం, మహ్మద్ అఫ్రోజ్, ముహమ్మద్ బదర్ పాషా తదితరులు పాల్గొన్నారు.