సొనియా రాహుల్‌తో ఓయూ జేఏసీ విద్యార్థుల భేటి

4
– తాజా రాజకీయ పరిణామాలపై చర్చ

న్యూఢిల్లీ,ఆగస్ట్‌8(జనంసాక్షి): సోనియాతో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి భేటీ అయ్యారు. తాజారాజకీయాలు, రాస్ట్రంలో పరిస్థితులపై చర్చింనట్లు సమాచారం.  ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో పాటు, ఓయూ విద్యార్ధులు శనివారం కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో కేసీఆర్‌ పాలన, విద్యార్థుల సమస్యలపై వివరించారు. ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగమన్న కేసీఆర్‌ ఇప్పుడు జిల్లాకొకటి కూడా ఇవ్వడం లేదని విద్యార్థులు సోనియా వద్ద తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ఆమె, ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. తెలంగాణ కొత్త రాష్ట్రం కాబట్టి రాష్ట్ర అభివృద్ధికి విద్యార్థులు కూడా కష్టపడాలని సోనియా సూచించారు. అనంతరం విూడియాతో ఉత్తమ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చినందుకు ఉస్మానియా విద్యార్ధులు సోనియాకు ధన్యవాదాలు తెలిపారని, తెలంగాణ పాటలు కూడా పాడారని వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధికి పాటుపడాలంటూ ఆమె సూచించారని తెలిపారు. ఇక ఉస్మానియా విద్యార్ధులు విూడియాతో మాట్లాడుతూ తెలంగాణ కోసం ఉద్యమం చేసింది విద్యార్థులు, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీనేని చెప్పారు. కేసీఆర్‌ నియంతలాగా వ్యవహరిస్తున్నారనీ, ఓయూకు వీసీ, సిబ్బందిని నియమించకుండా ప్రభుత్వం కాలయాపనచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణలో కేసీఆర్‌ పాలన, విద్యార్థుల సమస్యలపై చర్చ ఈ భేటీలో చర్చ జరిగింది. అనంతరం రాహుల్‌తో భేటీ అయ్యారు.ఎన్నికలకుముందు ఇంటికో ఉద్యోగమన్న కేసీఆర్‌ ఇప్పుడు జిల్లాకొకటి కూడా ఇవ్వడం లేదని విద్యార్థులు సోనియా వద్ద తమ ఆవేదనను వ్యక్తం చేశారు. మధ్యలో వచ్చిన కేసీఆర్‌ నియంతలాగా వ్యవహరిస్తున్నారనీ, ఓయూకు వీసీ, సిబ్బందిని నియమించకుండా ప్రభుత్వం కాలయాపనచేస్తోందని ఓయూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.