సోంపేట, కాకరాపల్లి ఘటనపై 17న మెజిస్టేరియల్ విచారణ
శ్రీకాకుళం, జూలై 10 : సోంపేట మండలం బేలప్రాంతంలో 2010 జూలై 14న జరిగిన పోలీసు కాల్పులపై ఈ నెల 15వ తేదీన మేజిస్టీరియల్ విచారణ నిర్వహిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. టెక్కలి ఆర్డీఓ కార్యాలయంలో 17వ తేదీన ఉదయం 10.30 గంటలకు విచారణ ప్రారంభమవుతుందన్నారు. సంతబొమ్మాళి మండలం కాకరాపల్లి ఘటనపై అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి అక్కడే విచారణ నిర్వహిస్తామని తెలిపారు. పోలీసు కాల్పులకు దారితీసిన పరిస్థితులపై విచారించనున్నట్లు ఆయన తెలిపారు.