సోనాల ఎస్సీ కమ్యూనిటీ భవనం కొరకు రూపాయలు 9 లక్షలు

బోథ్ (జనంసాక్షి) బోథ్ మండలంలోని సోనాల గ్రామపంచాయతీలో దళితుల సంక్షేమం కోసం నూతనంగా ఎస్సీ కమ్యూనిటీ భవనము నిర్మాణం కొరకు రూపాయలు ఐదు లక్షల ప్రొసీడింగ్ ను తుల శ్రీనివాస్ గురువారం అందజేసినారు. అలాగే ఎన్నో ఏళ్లుగా మరమ్మతుకు నోచుకోని ఎస్సీ కమ్యూనిటీ భవనం మరమ్మత్తుల కొరకై రూపాయలు నాలుగు లక్షల ప్రొసీడింగ్ ను అంబేద్కర్ భవనం దగ్గర అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు సొ న్న హరీష్ కు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీమాట్లాడుతూ దళిత సోదర సోదరీమణులు సంఘటితంగా ఉండి, వారి కష్ట సుఖాలను, వారి ఉజ్వల భవిష్యత్తును చర్చించుకోవడానికి వారికి ఒక వేదిక ఉండాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకొని తక్షణమే అమలుపరచడం జరిగిందన్నారు.
అలాగే దళితుల సంక్షేమం కొరకు తనవంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మండల ప్రధాన కార్యదర్శి బత్తుల రమేష్, మద్యల మహేష్, మాజీ ఎంపీటీసీ శ్రీమతి లలిత, ప్రేమ్ రాజు మంచాల భీమన్న, అంబేద్కర్ సంఘం కోశాధికారి పాముల సునీల్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.