సోనియాను కలిసిన తెలంగాణ ఎంపీలు
న్యూఢిల్లీ : తెలంగాణ విషయంలో టీ ఎంపీలు అధిష్టానం ముందు తన గోడును వినిపించారు. తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే మనం వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తిరగలేమని సూచించినట్లు తెలిసింది. తెలంగాణపై ఇక నాన్చుడు ధోరణి వీడాలని కోరినట్లు తెలిసింది. పార్లమెంటు హాల్‌లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని పార్టీ తెలంగాణ ఎంపీలు కలిశారు. తెలంగాణపై తమ అభిప్రాయాలతో కూడిన నోట్‌ను అధినేత్రికి అందించారు. పార్లమెంటులో తెలంగాణ అంశంపై మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని కోరారు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులున్నందున త్వరగా తెలంగాణ సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. సోనియాను కలిసిన వారిలో తెలంగాణ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, రాజయ్య, వివేక్, మందా జగన్నాథం ఉన్నారు.