సోనియా, రాహుల్‌ను కేసీఆర్ ఎందుకు విమర్శించడం లేదు
`తెదేపా నేత ఎర్రబెల్లి
హైదరాబాద్ :తెలంగాణ వనరులను కాంగ్రెస్ నాయకులు దోచుకుంటుంటే తెరాస అధినేత కేసీఆర్ ఏం చేశారని తెదేపా నేత ఎర్రబెల్లి ప్రశ్నించారు. ఎన్టీఆర్ ట్రస్టుభవన్‌లో అయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌పై మండిపడ్డారు. సకల జనుల సమ్మె మరో కొనసాగిస్తే తెలంగాణ వచ్చేదని అన్నారు. బీడీ కట్టల మీద పుర్రె గుర్తు వేస్తే… కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని అడిగారు. సోనియా, రాహుల్ గాంధీని కేసీఆర్ ఎందుకు విమర్శించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ విషయంలో తెదేపా స్పష్టంగా ఉందని తెలిపారు. తెలంగాణ అంశంపై తెదేపా తెలంగాణ ఫోరం తరపున త్వరలో జిల్లా సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడిరచారు.