సోమన్న గుట్ట ఘాట్ రోడ్డు, వడ్డెర కాలనీలో బ్రిడ్జి నిర్మాణానికిశంకుస్థాప చేసిన. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు .

మల్లాపూర్ ఆగస్టు28 (జనం సాక్షి) రాబోయే ఎన్నికల్లో నూటికి
నూరు శాతం గెలిచి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని
ఏర్పాటు చేసేది బీఆర్ఎస్ పార్టీయేనని సంక్షేమ
శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
సోమవారం మల్లాపూర్ మండల
కేంద్రంలోని సోమన్న గుట్ట ఘాట్ రోడ్డు, మండల
కేంద్రంలోని వడ్డెర కాలనీలో బ్రిడ్జి నిర్మాణానికి
శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా ముఖ్య
అతిథిగా మంత్రి కొప్పుల ఈశ్వర్, జడ్పీ చైర్ పర్సన్దావ వసంత పాల్గొనరు.. ఈ సందర్భంగా
ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున తప్పకుండా సోమన్న పైకి భక్తిశ్రద్ధలతో వస్తానని అదేవిధంగా నియోజకవర్గంలో గల అన్ని బ్రిడ్జిలు మరియు రోడ్డులు నిర్మాణం పూర్తి చేశామని కోరుట్ల నుండి ఎటు పోయిన డబుల్ రోడ్డులు చేశామని మల్లాపూర్ మోడల్ స్కూల్ దారికి నిధులు మంజూరయ్యాయని త్వరలో దాన్ని కూడా ప్రారంభిస్తాము. మన తెలంగాణలో కేసీఆర్ రాకముందు తెలంగాణ కెసిఆర్ వచ్చినంక తెలంగాణని చూస్తున్నమని ఈ రోజు తెలంగాణాలో ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో లబ్ధి పొందుతున్నారని అడగకముందే అన్నలా అన్ని చేస్తున్న ఘనత కేసీఆర్ దని దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలు రైతు బీమా, రైతుబంధు, కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్, బీసీ బందు, దళిత బంధు లాంటి గొప్ప పథకాలు నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణని కాంగ్రెస్ బిజెపి రాష్ట్రాలు పరిపాలిస్తున్న గ్రామాల్లో ఎక్కడ కూడా సరైన రోడ్లు కనీస వసతులు కూడా లేవు కరోనా సమయంలో సంజయ్ ఎంతోమందికి ఏదో రకంగా సహాయం చేశారని 20 సంవత్సరాల నిండిన విద్యార్థిని విద్యార్థులకు ఉచిత వ్యాక్సిన్ తో పాటు కరోనా కష్టకాలంలో ప్రతి కరోనా వచ్చిన రోగుల దగ్గరికి వెళ్లి మనోధైర్యాన్ని ఇచ్చారని ఇప్పుడు ఎన్నికల కోసం వస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కరోనాకాలంలో ఎటు వెళ్లారని విమర్శించారు అంతేకాకుండా ఇప్పుడు ఎలక్షన్లో ఉంటే వస్తున్నారని పేర్కొన్నారు 25 ఏళ్ల రాజకీయంలో నేను ఎమ్మెల్యేగా రెండుసార్లు ఓడిపోయిన ప్రజల వెంటే ఉన్నానని ఏప్పుడు కూడా ఆధైర్య పడలేదని పేర్కొన్నారు కష్టమైనా,సుఖమైన నా మీద నమ్మకంతో 25 సంవత్సరాల నుండి నా వెంటే ఉంటున్న కార్యకర్తలు నన్ను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని అదేవిధంగా ఇప్పుడు సంజయ్ ను కూడా ఆశీర్వదిస్తారని ఆశభావం వ్యక్తం చేశారు ఎమ్మెల్యేగా సంజయ్ గెలిచిన అనాధికారంగా ఐనా ప్రజల్లో ఉంటానని పేర్కొన్నారు ఇప్పుడు ఘాట్ రోడ్ నిర్మాణానికి 30 కోట్లు కాగా ప్రస్తుతం 10 కోట్ల నిధులు విడుదల చేశామని సంజయ్ ఎమ్మెల్యేగా గెలిచినక తిరిగి ఒక సంవత్సరం లోపల రోడ్డును పూర్తి చేసి సంజయ్ చేతులమీదుగా ప్రారంభిస్తామని పేర్కొన్నారు అంతేకాకుండా మల్లాపూర్ మండల కేంద్రంలో సెంటర్ లైట్ మరియు డివైడర్లు తప్పకుండా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే అకాల వర్షం వల్ల తెగిన రోడ్లను మరియు చెరువులను సంక్రాంతి లోగా పనులను ప్రారంభిస్తామని వాటికి సంబంధించిన ఎస్టిమేట్ తయారయిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో వారితోపాటు జగిత్యాల జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు చీటీ వెంకట్రావు ,మల్లాపూర్ మండల జడ్పీటిసి సందిరెడ్డి శ్రీనివాస్ , ఎంపీపీ కాటిపెళ్ళి సరోజన-ఆదిరెడ్డి , మల్లాపూర్ మండల బీఆర్ఎస్ అధ్యక్షులు తోట శ్రీనివాస్ మరియు కోరుట్ల నియోజకవర్గ ఆయా మండలాల అధ్యకక్షులు, జడ్పిటిసిలు, ఎంపీపీలు, వైస్ ఎంపీలు, సర్పంచులు, ఉప సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు..