సోలిపేట రామలింగరెడ్డి జయంతి వేడుకలు.

దౌల్తాబాద్ అక్టోబర్ 2, జనం సాక్షి.
దౌల్తాబాద్ మండల కేంద్రంలో శివాజీ చౌరస్తాలో మాజీ శాసనసభ్యులు సోలిపేట రామలింగారెడ్డి జయంతి సందర్భంగా ఆదివారం దౌల్తాబాద్ మండల అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రామలింగ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఆది వెంకటేశ్వర్లు,జిల్లా కోఆప్షన్ సయ్యద్ రహీముద్దీన్,ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బండారు దేవేందర్, వైస్ ఎంపీపీ అల్లిశేఖర్ రెడ్డి,ఏఎంసి వైస్ చైర్మన్ వేమ శ్రీనివాస్, ఉప సర్పంచ్ ముత్యం గారి యాదగిరి, ఏఎంసీ డైరెక్టర్లు నాగరాజు,పబ్బ అశోక్, పిఎసిఎస్ డైరెక్టర్ చిక్కుడు సత్యనారాయణ,పట్టణ అధ్యక్షులు ఉమ్మడి నరసింహారెడ్డి వార్డు మెంబర్లు పవన్ కళ్యాణ్, మాశెట్టి నరేష్ గుప్తా, నాయకులు సయ్యద్ ఖాళీలోద్దిన్, వంచ జనార్దన్ రెడ్డి, ఇప్ప దయాకర్, షాదుల్లా తదితరులు పాల్గొన్నారు.
2 Attachments • Scanned by Gmail