సోషల్‌ విూడియాలో కేసీఆర్‌పై..  విషం చిమ్మటమే ప్రతిపక్షాలపని


– అభివృద్ధిని అడ్డుకొనేందుకు కుట్రలు చేస్తున్నారు
– వేలాది కోట్లు ఖర్చుచేసి ఇరిగేషన్‌ ప్రాజెక్టులు చేపట్టాం
– కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్‌ ఎందుకివ్వడం లేదు
– మళ్లీ అధికారం తెరాసదే
– విలేకరుల సమావేశంలో ఆపద్ధర్మ మంత్రి ఈటల రాజేందర్‌
హైదరాబాద్‌, అక్టోబర్‌2(జ‌నంసాక్షి) : ప్రజాసంక్షేమ పాలన సాగిస్తున్న కేసీఆర్‌పై విషం చిమ్మటమే ప్రతిపక్షాలు పనిగా పెట్టుకున్నాయని ఆపద్ధర్మ మంత్రి ఈటల రాజేందర్‌ తీవ్రస్థాయిలో విమర్శించారు. మంగళవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మంత్రి ఈటల విూడియా సమావేశంలో మాట్లాడారు. సోషల్‌విూడియాలో వస్తున్న విషప్రచారాన్ని మంత్రి ఈటల తీవ్రంగా ఖండించారు. పేద ప్రజల అభ్యున్నతి ధ్యేయంగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుంటే, అభివృద్ధిని అడ్డుకొనేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరిగేషన్‌ ప్రాజెక్టులు చేపట్టామని తెలిపారు. మిగులు విద్యుత్‌కు తామే కారణం అంటున్న కాంగ్రెస్‌, బీజేపీలు వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్‌ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ సర్కారు ఉచిత విద్యుత్‌తో రైతుల కష్టాలకు చరమగీతం పాడిందన్నారు. నీళ్లు, నిధుల విషయంలో సంపూర్ణ విజయం సాధించామని తెలిపారు. ఆర్థిక పురోగమనంలో అన్ని రాష్ట్రాల కంటే ముందున్నామని ఈటల పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం లక్షా 28 వేల 2 4ఉద్యోగాలను గుర్తించామని, అందులో లక్షా 2వేల 217 ఉద్యోగాల భర్తీకి అనుమతిచ్చామన్నారు. 87,346 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేయగా, ఇప్పటి వరకు 37,781 ఉద్యోగాలను భర్తీ చేశామని ఈటల చెప్పుకొచ్చారు. నిరుద్యోగులకు ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించామని తెలిపారు. సమైక్యాంధ్ర ప్రభుత్వంలో వెట్టిచాకిరి చేయించుకున్నారని ఈటల వ్యాఖ్యానించారు. ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణను సాధించుకున్నామని, తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కాంట్రాక్ట్‌ లెక్చరర్లు, ¬ంగార్డులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్ల జీతాలు పెంచామన్నారు. లక్షలాది మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించినమని ఈటల అన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో మళ్లీ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందని ఈటల ధీమా వ్యక్తం చేశారు.