*సౌత్ ఇండియా సమావేశాలకు తరలి వెళ్లిన లారీ అసోసియేషన్ నాయకులు* కోదాడ జూన్ 14(జనం సాక్షి)

కోదాడ జూన్ 14(జనం సాక్షి);-సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (సిమిట)సమావేశాలు ఈనెల 14 ,15 తారీకుల్లో కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరులో జరుగుతున్న సందర్భంగా కోదాడ లారీ అసోసియేషన్ నాయకులు రాష్ట్ర నాయకత్వం తో కలిసి హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుండి సమావేశాలకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా లారీ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2019 మోటార్ వెహికల్ యాక్ట్ రద్దు చేయాలని అదేవిధంగా గ్రీన్ టాక్స్, సరుకు రవాణా పై తలెత్తుతున్న  సమస్యలు, ఇంకా అనేక విధాలుగా రవాణా రంగం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ఈ సమావేశంలో చర్చించిన అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పై రవాణా రంగం సమస్యలు పరిష్కరించేందుకు ఒత్తిడి తీసుకురానున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర లారీ అసోసియేషన్ చైర్మన్ గుమ్మడి దుర్గాప్రసాద్, రాష్ట్ర అధ్యక్షులు మంచి రెడ్డి రాజేందర్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు రామినేని శ్రీనివాసరావు ఉమ్మడి నల్గొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అసోసియేషన్ ప్రధాన సలహాదారులు అవుల రామారావు, కోదాడ లారీ అసోసియేషన్ అధ్యక్షులు కనకాల నాగేశ్వరరావు తదితరులు లారీ యజమానులు తరలి వెళ్లారు.