సౌలతులు లేని సర్కారు దవాఖాన.

ఓపిడిఆర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి అంబాల మహేందర్.
పోటో: ఒకే బెడ్ పై చికిత్స అందిస్తున్న సిబ్బంది.
బెల్లంపల్లి, అక్టోబర్ 12 (జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలోని సర్కారు దవాఖానలో సౌలతులు అస్సలు లేవని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి అంబాల మహేందర్ ఒక ప్రకటనలో ఆరోపించారు. బెల్లంపల్లి సర్కారు దవాఖానలో 30 బెడ్లు ఉండాల్సి ఉండగా కేవలం 20 బెడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. అందులో 8 బెడ్లు మహిళలకు, 8 బెడ్లు పురుషులకు, మరో 4 బెడ్లు అత్యవసర చికిత్స కోసం కేటాయించారన్నారు. బుధవారం పట్టణానికి చెందిన ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురైతే ఇద్దరిని ఒకే బెడ్ పై కూర్చోబెట్టి చికిత్స అందించారని ఆరోపించారు. 30 బెడ్లు ఉండాల్సిన దవాఖానలో 20 బెడ్లు మాత్రమే అందుబాటులో ఉంచారని, పెద్దాఫీసర్లు స్పందించి ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.