స్కూళ్లను మూసివేస్తే ఊరుకోం…

నిర్మల్‌ రూరల్‌, న్యూస్‌లైన్‌: విద్యార్థుల సంఖ్య తక్కువ ఉందన్న సాకుతో ప్రభుత్వం పాఠశాలలను మూసివేస్తే ఊరుకునేది లేదని టీయూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు స్యామిరెడ్డి అన్నారు. శుక్రవారం నిర్మల్‌లోని టీఎన్జీవో భవనంలో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు నెంబర్‌ 113 ప్రకారం 10 కంటే తక్కువ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలను మూసివేస్తామని నిర్ణయించడం దారుణమన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి 30 మంది విద్యార్థులకో ఉపాధ్యాయుడిని నియమించాలనే నింబధనను విస్మరించడం సరికాదన్నారు.

ప్రభుత్వ నిర్ణయంం ప్రకారం మూడు వేల పాఠశాలలు మూసివేతకు గురవుతాయని, అలా చేస్తే ఊరుకునేది లేదన్నారు. పదో పీఆర్పీలో గతంలో నష్టపోయిన సీనియర్‌ ఉపాధ్యాయులకు వేయిటెజ్‌ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, జీవో 96కు సవరణలు చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యావలంటీర్లను ఏప్రిల్‌ 24 వరకు కొనసాంగిచాలని, సీఆర్‌పీలకు నెలనెలా వేతనాలివ్వాలని కోరారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షున్ని  పలువురు సన్మానించారు. టీయూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శులు టి. లచ్చిరాం, లక్ష్మిప్రసాద్‌రెడ్డి, జిల్లాప్రధాన కార్యదర్శి బి. దేవన్న, జిల్లా కార్యదర్శులు వై.రాంరెడ్డి, పి.ధర్మరాజ్‌, మురళీమనోహర్‌రెడ్డి, సాహెబ్‌రావుపవార్‌, మండల బాధ్యులు గోలి సాయన్న, కిషన్‌, రాజేందర్‌రెడ్డి, రఘువీర్‌పాణి, రవికాంత్‌, సునిల్‌రెడ్డి, రవికిరణ్‌, పరమేశ్వర్‌రెడ్డి, నారాయణ, సాయిరెడ్డి పాల్గొన్నారు.