స్టాక్‌మార్కెట్ నష్టాలతో ముగిసింది
ముంబాయి: జూన్‌లో పారిశ్రామిక ఉత్పత్తి ఆశించినస్థాయిలో లేకపోవడం స్టాక్‌మార్కెట్‌పై ప్రభావాన్ని చూపడంతో మార్కెట్ నష్టాలతో ముగిసింది. ఎయిర్‌టెట్ ప్రకటించిన ఫలితాలు నిరాశజనకంగా ఉండటంతో ఆ సంస్థ షేర్లు 6.40 శాతం తాగ్గాయి. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీల షేర్ల విలువ క్షీణించాయి. సెన్సెక్స్ 39.69 పాయింట్లు కోల్పోయి 17560.87 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ 15.05 పాయింట్ల నష్టంతో 5322.95 వద్ద ముగిశింది. రిఫైనరీ, బ్యంకింగ్ వినియోగాదారుల వస్తువుల తయారీసంస్థల షేర్లు నష్టాలతో ముగియగా ఎఫ్‌ఎంసీజీ, లోహ వాహనరంగాలకు చెందిన షేర్లు లాభాలనార్జించాయి.