స్టార్ కాంపెయినర్గా మారిన చంద్రబాబు
బిజెపిని తిడుతూ ప్రాధాన్యం పెరిగేలా చేస్తున్న బాబు
కన్నా రాకతో మరింతగా పెరిగిన విమర్శల దాడి
అమరావతి,జూన్19(జనం సాక్షి): కారణాలు ఏమైనా…ఎపిలో మాత్రం బిజెపికి అసలు స్థానం లేదన్న దశ నుంచి బిజెపిని ఓ బూచిగా చూపి టిడిపి రాజకీయాలు నెరపుతోంది. జగన్‌కు ఓటేస్తే బిజెపికి ఓటేసినట్లేనని అంటోంది. బిజెపికి అంత సీన్ లేదంటున్న టిడిపి ఎందుకనో బిజెపి నీడను చూస్తేనే భయపడుతోంది. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న టిడిపి అధినేత, సిఎం చంద్రబాబు కూడా పదేపదే బిజెపి నామ జపాన్ని చేస్తున్నారు. మొత్తంగా బిజెపి అన్నది ఇప్పుడు ఎపిలో ఎదుగుతున్న పార్టీగా ప్రజలు చూస్తున్నారు. టిడిపికి ప్రత్యమ్నాయంగా బిజెపిని తీసుకుని వెళ్లడంలో ప్రతి ఒక్కరూ తమవంతుగా పాటుపడుతూనే ఉన్నారు. ఇందులో ప్రధాన పాత్ర టిడిపిదే అని అనడంలో సందేహం లేదు. బిజెపిపై విమర్శలు లేకుండా చంద్రబాబు కార్యక్రమాలు సాగడం లేదు. ఈ రకంగా బాబు బిజెపికి స్టార్ కాంపెయినర్‌గా, ఇతర నేతలు ప్రచార నేతలుగా మారారు. ఇక కాంగ్రెస్‌లో మంత్రిగా ఉండి రాజకీయాలు నెరిపిన కన్నా లక్ష్మీనారాయణ కూడా బాబును తిట్టడంలో సిద్దహస్తుడు కావడంతో బిజెపికి కలసి వస్తోంది. తిట్టుకోవడాల ద్వారా పార్టీని ప్రజల్లో నాన్చడం ఇప్పుడు ఒక ప్రచారంగా మారింది. కన్నా లక్ష్మీనారాయణ ఎపికి అధ్యక్షుడు అయ్యాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై దూకుడు పెంచారు. బాబు గతాన్ని తవ్వి విమర్శించడమే లక్ష్యంగా సాగుతున్నారు. ఓ రకంగా టిడిపి వారు తమ పాత పాపాలను కన్నాద్వారాచెప్పించుకుంటున్నట్లుగా ఉంది. చంద్రబాబును గజదొంగ అని అనడమే కాకుండా,బజారులో ఉన్న పార్టీల మద్య అక్రమ సంబందాలు అంటగడతాడని, కాంగ్రెస్‌కు అద్దె మైకు అని కన్నా చేస్తున్న ఆరోపణలు బలంగానే ప్రజల్లోకి వెళుతున్నాయి. రాష్ట్రాన్ని చంద్రబాబు అమ్మేస్తున్నాడని,తండ్రీ కొడుకులు కలసి దోచుకుంటున్నారని కూడా ఆయన అంటున్నారు. కన్నా లక్ష్మీనారాయణను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు బిజెపి అద్దె మైకు అని వ్యాఖ్యాస్తే దానికి ఆయన బదులుగా వంద విమర్శలను చేస్తున్నారు. దీంతో బురదలో రాయి వేసిన చందంగా టిడిపి వైఖరి మారిందనే చెప్పాలి. గతంలో బిజెపి అధ్యక్షుడుగా ఉన్న కంబంపాటి హరిబాబు ఇంతలా దూకుడుగా వ్యవహరించేవారు కాదు. ఆయన హుందాగా మాట్లాడేవారు. సోము వీర్రాజు వంటి నేతలు చంద్రబాబుపై అనేక ఆరోపణలతో పైర్ అవుతున్నా,హరిబాబు మాత్రం ఎప్పుడూ పెద్దగా ఆరోపణలు చేసేవారు కాదు. తెలుగుదేశం నేతలు ఎన్ని ఆరోపణలు చేసినా అంతగా పట్టించుకునేవారు కాదన్న అభిప్రాయం ఉంది. కానీ సోము వీర్రాజుకు తోడన్నట్లుగా ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ బాధ్యతలు చేపడుతూనే చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించడంతో బిజెపి అంటే తెలియని స్తితి నుంచి టిడిపి తరవాత బిజెపి కూడా ప్రచారంలో దూసుకుని పోతోంది. ఇలా జరగడానికి ప్రధాన కారణం చంద్రబాబు తప్ప మరొకరు కాదు. ఆయనే పనిగట్టుకుని బిజెపిని విమర్శించి లేని ప్రతిష్టను తెచ్చి పెట్టారు. ముఖ్యంగా బిజెపికి,ఇతర పార్టీలు వైఎస్ ఆర్ కాంగ్రెస్, జనసేన పార్టీలకు సంబంధాలు అంటగట్టి చంద్రబాబు చేస్తున్న విమర్శలు ఓ రకంగా టిడిపికి ఎదురుదెబ్బలు తాకేలా చేస్తున్నాయనడంలో సందేహం లేదు. ఎదుటి పార్టీలను ఆత్మరక్షణలో పడేసే విషయంలో చంద్రబాబుది అందెవేసిన చెయ్యే అని చెప్పాలి. ఆయన రాజకీయ జీవితంలో ఇలాంటివి ఎన్నో చేశారు. కానీ ఇప్పుడా పరిస్తితి లేదు. ఎందుకంటే అమరావతి త్రీడీ చూపించిన బాబు కనీసంగా ఒక్క భవనం కూడా కట్టలేదుగాక, నాలుగేళ్లుగా ఎపిలో అభివృద్ది అన్నది కేవలం పత్రికా ప్రచారంలోనే కనిపిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. తెలంగాణ లాగా తమకూ ఓ కెసిఆర్ ఉంటే బాగుండన్న వాదనా ఉంది. 1978లో తొలిసారి ఇందిరా కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన దగ్గరి నుంచి చంద్రబాబు తనకు అనుకూలంగ ఆరాజకీయాలు నడుపుతూ ఎదుటి పక్షాలను బోల్తా కొట్టిస్తూ వచ్చారు. చివరకు సొంతపార్టీలో అధినేత ఎన్టీఆర్‌నే గద్దెదించారు. ఆయనను పదవీచ్యుతిడిని చేసి, ఆయన విగ్రహానికే దండలు వేస్తున్నారు. 1994 వరకు ఆయన టిడిపిలో తిరుగలేని నేతగా ఉంటూ అవసరమైనప్పుడు కాంగ్రెస్ నేతల మద్య ఉన్న విబేదాలను తనకు అనుకూలంగా వాడుకునే యత్నం చేసేవారు. తదుపరి ఎన్టీఆర్‌ను పదవి చ్యుతుడిని చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత యునైటెడ్ ప్రంట్ ప్రభుత్వం ఏర్పాటులో భాగస్వామి అయ్యారు. ఆ ఫ్రంట్ లో ఉండగా బిజెపిని మసీదులు కూల్చే పార్టీఅని విమర్శించేవారు. కాని ఆ తర్వాత అదే భారతీయ జనతా పార్టీతో ఆయన అక్రమ సంబందం పెట్టుకుని యునైటెడ్ ప్రంట్ వారందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఎన్‌డిఎలోకి వచ్చేశారు. ఆ తరవాత ఆయన రకరాకాలుగా రాజకీయాలు నెరిపారు. విభజన సమయంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నవ వేళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రబుత్వం పడిపోకుండా తటస్త వైఖరి అవలంబించి కాంగ్రెస్‌తో అనైతిక రాజకీయ అక్రమ సంబందం పెట్టుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. నరేంద్ర మోడీ గుజరాత్ సిఎంగా ఉండగా నరహంతకుడని, బిజెపితో జన్మలో సంబందం పెట్టుకోనని చంద్రబాబు చెప్పేవారు .కాని ఆ తర్వాత ఆయనతోనే పొత్తుపెట్టుకుని నాలుగేళ్లు కాపురం చేశారు. విభజ.న హావిూలు నెరవేరడం లేదంటూ బిజెపిని, నరేంద్రమోడీని తిడుతూ బయటకు వచ్చిన బాబు ఇప్పుడు బిజెపి వేసిన ఉచ్చులో పడ్డారు. బిజెపికి నష్టం కలగకపోగా లాభం జరుగుతోంది. బిజెపిని,మోడీని తిడుతూ కర్నాటకలో రాహుల్‌గాంధీతో కరచాలనం చేయడంతో ఇప్పుడాయన ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం అన్న విమర్శలను బిజెపి ఎత్తి చూపుతోంది. కన్నా రాకతో విమర్వల దాడి పెరిగిందనే చెప్పాలి. నాలుగేళ్లపాటు బిజెపి,టిడిపిలు లాలూచీ రాజకీయాలే నడిపాయన్న బావన ఏర్పడుతోంది. ఎందుకంటే నాలుగేళ్లుగా చంద్రబాబు అవినీతికి పాల్పుడుతున్నా బిజెపి నోరెత్తి ఇంతకాలం ఏవిూ అనకుండా లాలూచీగానే వ్యవహరించింది. అలాగే కేంద్రం ఏవిూ చేయలేదని అంటున్న చంద్రబాబు, ఈ నాలుగేళ్లు ఎందుకు బిజెపితో లాలూచీ పడ్డారో వివరించాలి. వైఎస్ ఆర్ కాంగ్రస్,జనసేన వంటి పార్టీలకు బిజెపితో సంబందం అంటకట్టి లాభపడాలన్నది చంద్రబాబు లక్ష్యం కావచ్చు. కానీ ఇవన్‌ఈన నమ్మడానిక ఇప్రజలు వెర్రివాళ్లు కాదు. వారంతా ఇప్పుడు బాబు నాలుగేళ్ల కాపురంపసైనా, అవినీతిపైనా ఎదురు తిరుగుతున్నారు. అందుకే బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బజారులో ఉన్న పార్టీలన్నిటికి అక్రమ సంబందాలు అంటగడుతున్నారని విమర్శించారు.చంద్రబాబు చరిత్ర అంతా కన్నాకు బాగానే తెలుసు. కన్నా బిజెపిలో ఉండడం, అద్యక్షుడు కావడంతో బాబును తిట్టేందుకు మరింతగా అవకాశం వచ్చింది. దాదాపు పదిహేనేళ్లు మంత్రిగా ఉన్న కన్నా బాబుగ ఉరించి బాగా తెలిసి ఉన్నారు. ఇప్పటి వరకు సోము వీర్రాజు వంటి కొద్ది మంది నేతలు టిడిపిపై తీవ్ర ఆరోపణలు చేసినా ,బిజెపి జాతీయ నాయకత్వం పెద్దగా పట్టించుకోలేదు. కన్నాకు అధ్యక్షపదవి కట్టబెట్టాక ఇక బిజెపి దూసుకుని పోయేలా చేశారు. ఇంతకాలం బిజెపిని పట్టుకుని, ఇప్పుడు దానిని విమర్శించడం ద్వారా ఆ పార్టీకి చంద్రబాబు ఓ రకంగా స్టార్ కాంపెయినర్‌గా మారారు.