స్టూడెంట్స్ కు ఆర్డర్: యోగి హెయిర్ స్టైల్‌ను ఫాలో అవ్వండి
ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లా హెయిర్ కట్ చేయించుకోవాలని మీరట్‌లోని ఓ ప్రైవేట్ స్కూలు విద్యార్థులను ఆదేశించింది. లేదంటే తరగతి గదిలోకి అనుమతించమని చెప్పింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు స్కూలు ముందర ఆందోళనకు దిగారు. మీరట్‌లోని రిషబ్ అకాడెమీ స్కూలు కొత్త నిబంధనలు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థుల తల్లిదండ్రులు. అంతేకాదు స్కూలు కాంపౌండ్‌లో నాన్‌వెజ్ తినడాన్ని నిషేధించారని విద్యార్థులు తెలిపారు. ఈ ఆరోపణలు అవాస్తవమని స్కూలు యాజమాన్యం కొట్టిపారేసింది.
క్రమశిక్షణలో భాగంగా విద్యార్థులు చిన్న హెయిర్‌కట్ కలిగి ఉండాలని ..నీట్‌గా డ్రెస్స్ కావాలని మాత్రమే చెప్పినట్లు స్కూలు మేనేజర్ వివరణ ఇచ్చారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంపొందించాలన్న ఉద్దేశంతోనే చిన్న హెయిర్‌కట్‌తో స్కూలుకు రావాల్సిందిగా కోరామని చెప్పారు. అయితే స్కూల్ ప్రెమిసెస్‌లో మాంసాహారం తినరాదని ఎప్పుడూ చెప్పలేదని నాన్‌వెజ్‌పై ఎలాంటి ఆంక్షలు విధించలేదని మేనేజర్ చెప్పారు. చిన్న విషయానికి మతపరమైన రంగు పులుముతున్నారని అన్నారు.