స్తంభం పల్లిలో ఘనంగా ఎల్లమ్మ పోచమ్మ బోనాలు
బోయిన్ పల్లి అక్టోబర్ 11(జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్తంభం పల్లి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ సిద్ధోగంలో భాగంగా మంగళవారం రోజు పోచమ్మ ,ఎల్లమ్మ బోనాలు నిర్వహించారు.ఈ సందర్బంగా ఇంటింటికి గౌడ సంఘం ఆధ్వర్యంలో మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు ఎత్తుకొని పోచమ్మ ఎల్లమ్మ లకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. బైండ్ల పూజారిలా డప్పు చప్పులతో శివసత్తుల పూనకాలతో అంగరంగ వైభవంగా గ్రామంలో నిర్వహించారు. గత సంవత్సరం నూతన ఎల్లమ్మ ఆలయంలో నిర్మించి ఎల్లమ్మ సిద్ధోగం నిర్వహించగా మారు బోనం మంగళవారం రోజు నిర్వహించడం జరిగిందని గౌడ సంఘ నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు పులి లక్ష్మీ పతి గౌడ్ , బొంగాని మల్లేశం గౌడ్, బొంగాని అశోక్ గౌడ్ గౌడ సంఘం అధ్యక్షులు కాసారపు మల్లేశం గౌడ్ ఉపాధ్యక్షులు పర్శరాములు గౌడ్ ప్రధాన కార్యదర్శి పులి అంజయ్య గౌడ్ కొశాదికారి పులి సతీష్ గౌడ్, చింతలకోట శ్రీనివాస్ గౌడ్, పులి లక్ష్మణ్ గౌడ్,గౌడ సంఘం సభ్యులు మరియు మహిళలు పాల్గొన్నారు.