స్తంభించిన ట్రాఫిక్.. ఎంసెట్ విద్యార్థుల ఇబ్బందులు
హైదరాబాద్ : నగరంలో పలుచోట్ల ఈ ఉదయం ట్రాఫిక్ స్తంభించింది. భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ఎంసెట్ పరీక్ష రాసేందుకు వెళ్తున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తార్నాక కూడలి వద్ద, ఎల్‌బీనగర్-మలక్‌పేట మార్గంలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి.