స్థలం విషయంలో గ్రామస్తుల్లో సందిగ్ధత

ప్రభుత్వ స్థలం మా..? లేదా ప్రైవేటు వ్యక్తుల స్థలమా…?
* గ్రామంలో జోరుగా చర్చలు,
* తేల్చవలసిన అధికారులు ఎక్కడ..?
ఖానాపురం జనం సాక్షి
మండలంలోని అశోక్ నగర్ గ్రామం స్థలం విషయం గ్రామంలో సందిగ్ధత నెలకొంది అసలుప్రభుత్వ స్థలము..? లేదా ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు స్థలం..? అంటూ గ్రామంలో జోరుగా చర్చలు వస్తున్నాయి. అసలు గ్రామపంచాయతీ రికార్డులు ఏమున్నది…?గ్రామంలో పలువురు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం అశోక్ నగర్ గ్రామంలో పాత గ్రామపంచాయతీ పక్కన గత 15 సంవత్సరాల క్రితం నుండి గోగు పోచమ్మ మహిళా ఉండేదని గత కొన్ని నెలల క్రితం మహిళా మృతి చెందడంతో ఆ స్థలం పై కొందరు వ్యక్తులు ఆ స్థలం మాది మా దగ్గర కాగితాలు ఉన్నాయంటూ మరి కొందరు మా దగ్గర కూడా ఉన్నాయంటూ వాగ్వాదానికి దిగుతున్నట్లు సమాచారం.అదే కాకుండా చౌకధర (కంట్రోల్ )డిపో అధికారులు స్థలం మాది అని అంటున్నారు అన్నట్లు సమాచారం. ఇట్టి స్థలంలో కొందరు వ్యక్తులు మాది అని బోర్డులు బాదినట్టు కూడా సమాచారం.అసలు స్థలం ఎవరిది..? ప్రభుత్వ స్థలమా..?ప్రైవేటు వ్యక్తుల స్థల మా…? అధికారులు తేల్చాల్సి ఉంది