స్పీకర్‌కు లేఖ రాసిన మంత్రి ఆనం

హైదరాబాద్‌ : వ్యవసాయ బడ్జెట్‌ గందరగోళంపై ఆర్థిక మంత్రి రాంనారాయణ రెడ్డి బుధవారం స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కు లేఖ రాశారు. వ్యవసాయ ప్రణాళిక సందర్భంగా కొన్ని పొరపాట్లు జరిగాయని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. లేఖను మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, శ్రీధర్‌ బాబు స్వయంగా స్పీకర్‌కు అందచేశారు.బడ్జెట్‌ సందర్భంగా సమన్వయ లోపంతో పొరపాట్లు జరిగాయని వారు వివరణ ఇచ్చారు. ప్రచురణలో కూడా కొన్ని తప్పులు దొర్లినట్లు మంత్రి ఆనం అంగీకరించారు. పొరపాట్లను మన్నించాలని ఆయన లేకలో కోరారు. వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయ కార్యాచరణగా మారుస్తూ కొత్త పుస్తకాలను ప్రభుత్వం సభ ముందు ఉంచనుంది. దీనిపై దీనిపై రాంనారాయణ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు.