స్పెషల్ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలి 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలి.
జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వల్లూరు క్రాంతి.
గద్వాల నడిగడ్డ, ఆగస్టు 26 (జనం సాక్షి);
స్పెషల్ సమ్మరీ రివిజన్- 2023, రెండవ ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా 26, 27 ఆగస్టు, శని, ఆదివారలలో ఓటరు జాబితాలలో సవరణలు, మార్పులు, చేర్పులు చేసుకునే కార్యక్రమం జరుగుతుందని అందరూ బూతు లెవల్ అధికారులు తమ తమ పోలింగ్ కేంద్రాలలో ఉదయం 10. గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉంటారని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. శనివారం ప్రారంభమైన కార్యక్రమాన్ని గట్టు మండలం మాచర్ల, ఆలూరు పోలింగ్ స్టేషన్ కేంద్రాలలో జరుగుతున్న కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి కావాల్సిన సమాచారాన్ని ఇవ్వాలని సవరణలో మార్పులు, చేర్పులు, ఏమైనా ఉంటే సంబంధిత ఫారం ద్వారా దరఖాస్తులు తీసుకోవాలని, గ్రామాలలో చనిపోయిన ఓటర్ల వివరాలను సేకరించి విచారణ చేసి తొలగించాలని బూత్ లెవల్ అధికారులకు సూచించారు.
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు
అందుకు క్షేత్రస్థాయిలో ఇప్పటికే అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
శనివారము అందుబాటులో లేని వారు రేపు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సంబంధిత పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి తమ పేర్లను ఓటరు జాబితాలో పరిశీలించుకోవాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో బీ ఎల్ ఓ లు, సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.