స్మశానవాటికలో ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్య

మెదక్‌, (మార్చి 11): మెదక్‌ జిల్లా సంగారెడ్డిలోని స్మశానవాటికలో ఒక ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం జరిగిన ఈ సంఘటన సంగారెడ్డిలో కలకలం సృష్టించింది. స్థానికుడు లచ్చయ్య స్మశానవాటికలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనపరుచుకున్నారు. కాగా, ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.