స్మిత్ బౌండరీల వర్షం
సిడ్నీ,మార్చి26 (జనంసాక్షి) : యాదవ్ వేసిన పదో ఓవర్ మొదటి బంతిని స్మిత్ పాయింట్‌లోంచి కట్ చేసి ఒక బౌండరీ, రెండో బంతికి మిడ్ వికెట్‌లోంచి మరో బౌండరీ సాధించాడు. రెండు వరుస బౌండరీలతో ఆసీస్ స్కోరు 48కి చేరింది. యాదవ్ నాల్గో బంతిని షార్ట్ మిడ్ వికెట్‌లోంచి పుల్ చేసి స్మిత్ మూడో బౌండరీ సాధించటం ద్వారా ఆసీస్ స్కోరును 50 పరుగుల మైలు రాయిని దాటించాడు. ఐదో బంతిని కూడా మిడ్ వికెట్‌లోంచి మరో ఫోరు సాధించి స్మిత్ బౌండరీల వర్షం కురిపిస్తున్నాడు. యాదవ్ వేసిన పదో ఓవర్‌లో స్మిత్ నాలుగు బౌండరీలు సాధించటం విశేషం. ఐదో ఓవర్ తర్వాత పరుగులు నియంత్రించటంలో పట్టు సాధించిన బౌలర్లు పదో ఓవర్‌లో నాలుగు బౌండరీలు ఇవ్వటం మూలంగా మరోసారి నియంత్రణ కోల్పోయారు. 27వ ఓవర్ మూడో బంతికి సింగిల్ తీయటం ద్వారా ఫించ్ 83 బంతుల్లో అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. ఎప్పుడూ ధాటిగా ఆడే ఫించ్ తన స్వభావానికి విరుద్ధంగా నెమ్మదిగా ఆడుతున్నాడు. మరో ఎండ్‌లో ఉన్న స్మిత్‌కు స్టాండ్ ఇస్తూ తన ఇన్నింగ్స్‌ను నిర్మిస్తున్నాడు. ఇద్దరు బ్యాట్స్‌మెన్లు ఐదు పరుగులపైబడిన సరాసరితో వికెట్లు పోకుండా స్కోరు పెంచుతూ భారీ స్కోరుకు పునాది వేస్తున్నారు. 35 ఓవర్ల వరకూ ఇలాగే కొనసాగి వికెట్లు చేతిలో ఉంటే భారీ స్కోరు కోసం ప్రయత్నం చేయాలన్నది ఆస్గే/లియా వ్యూహం కావచ్చు. 29వ ఓవర్ నాలుగో బంతికి ఆస్గే/లియా 150 పరుగుల మైలు రాయి చేరుకుంది. ఫించ్, స్మిత్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆడుతున్నారు. ఫించ్ ఆచితూచి ఆడుతుండగా.. స్మిత్ బంతికో పరుగు చొప్పున సాధిస్తూ వేగంగా ఆడుతున్నాడు. ఈ పరిస్థితుల్లో వికెట్ పడకుండా స్కోరు పెంచాలన్నదే బ్యాట్స్‌మెన్ల లక్ష్యంగా ఉంది. పిచ్ నుంచి ఎటువంటి
సహకారం లేకపోవడంతో బౌలర్లు కూడా పరుగులు నియంత్రిస్తే చాలు అన్నట్లుగా బంతులు వేస్తున్నారు.