స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరం

పినపాక నియోజకవర్గం ఆగష్టు 17 (జనం సాక్షి):75వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో  వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం డిఎంహెచ్ ఓ దయానంద స్వామి మణుగూరు ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ గిరి ప్రసాద్   నేతృత్వంలో బుధవారం   మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మెగా శిబిరానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, జిల్లా కలెక్టర్  దురిశెట్టి అనుదీప్ హాజరయ్యారు. అనంతరం వారి చేతుల మీదుగా రక్త దాతలకి సర్టిఫికెట్ ను అందజేశారు. ఈ సందర్భంగా దయానంద స్వామి మాట్లాడుతూ మణుగూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు నిర్వహిస్తున్న మెగా రక్తదాన శిబిరానికీ  మణుగూరు ,పినపాక, అశ్వాపురం మండలాల నుంచి సుమారు 150 మంది రక్తదాతలు స్వచ్ఛందంగా  రక్తం ఇవ్వడానికి  ముందుకు వచ్చారు. రక్త సేకరణ ద్వారా   అత్యవసర సమయంలో రక్త నిధి లేక ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అలాంటి పరిస్థితి తలెత్తకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ అందుబాటులో ఉండేవిధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలో  మౌలిక సదుపాయాలతో పాటు రక్త నిధి కూడా అందుబాటులో ఉండటం వల్ల  ప్రజలకు.మెరుగైన వైద్యం అందుతోంది. ఈరోజు నిర్వహించిన మెగా రక్త దాన శిబిరానికి వచ్చిన దాతలకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో మణుగూరు తహసిల్దార్ నాగరాజు   ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ గిరి ప్రసాద్, చేతన్, రమాకాంత్, కంటి వైద్యులు జి సంజీవరావు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు వైద్య సిబ్బంది. ఏరియా హాస్పిటల్ వైద్యులు సిబ్బంది స్వచ్ఛంద సంస్థలు తదితరులు పాల్గొన్నారు.