స్వయం సహాయక సంఘాలకు ₹ 15 రుణం మంజూరు.
రుణం మంజూరు చేస్తున్న బ్యాంకు మేనేజర్.
బెల్లంపల్లి, అక్టోబర్1,(జనంసాక్షి)
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల చరిత్రలో ఏక మొత్తంగా ₹ 15 లక్షల రుణం మంజూరు చేసిన ఘనత నెన్నెల తెలంగాణ గ్రామీణ బ్యాంకు శాఖకు దక్కింది. నెన్నెల మండల కేంద్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు గతంలో సరస్వతి గ్రామీణ బ్యాంకుగా పేరుతో రూపుదిద్దుకొని, ఆతర్వాత దక్కన్ గ్రామీణ బ్యాంకుగా పేరు మార్చుకొని, ఇప్పుడు తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా సేవలందిస్తున్న బ్యాంకు లావాదేవీలు పెరగడంతో ఖాతాదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉన్న బ్యాంకు మేనేజర్లకు రుణ మంజూరు పరిమితి ఉండటంతో వారు వారి పరిధిలో రుణాలు మంజూరు చేశారని, కానీ రావుల మల్లన్న స్వయం సహాయక సంఘం గత ఇరవై సంవత్సరాలుగా క్రమం తప్పకుండా కిస్తీలు చెల్లించి, వ్యక్తిగతంగా ₹ 15 లక్షల రుణం మంజూరు చేసుకున్న ఘనతను దక్కించుకుందని బ్యాంకు అధికారులు తెలిపారు. ప్రతి ఒక్క స్వయం సహాయక సంఘం కిస్తీలను క్రమం తప్పకుండా చెల్లించి ఉన్నత రుణాలు పొందేలా చూడాలని బ్యాంకు అధికారులు కోరుతున్నారు. ఈకార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ రాజారాం, ఫీల్డ్ ఆఫీసర్ సుధీర్ కుమార్, క్యాషియర్ రాజు, కొమురయ్య, సిబ్బంది రాజు, వెంకన్న, ఐకేపీ వివోఏ మల్లీశ్వరి, స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఖాతాదారులు పాల్గొన్నారు.