స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉచిత శిక్షణ
మెదక్, అక్టోబర్ 9 : తెల్లరేషన్ కార్డులు కలిగి స్వయం సహాయక సంఘాల కుటుంబ సభ్యులకు టైలరింగ్, బ్యూటీపార్లర్, అప్పడాలు, పచ్చళ్ల తయారీలో ఉచితంగా మహిళలకు శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ దినకర్‌బాబు మంగళవారం నాడు ఇక్కడ తెలిపారు. స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కల్పన కేంద్రం ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. బ్యూటీ పార్లర్ నిర్వహణకు 10వ తరగతి పాసు లేదా ఫెయిల్, లేడిస్ టైలరింగ్‌కు రాయడం చదవడం వచ్చి ఉండాలి. ఈ శిక్షణ కాలంలో అభ్యర్థులకు ఉచిత భోజన, వసతి కల్పించనున్నట్టు చెప్పారు, కోర్సు మెటీరియల్ ఉచితంగా సరఫరా చేయనున్నట్టు కలెక్టర్ తెలిపారు. ఆసక్తి ఉన్న స్వయం సహాయక గ్రూప్ కుటుంబ సభ్యులు డైరెక్టర్, స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కల్పన కేంద్రం, కలెక్టరేట్ ఎదురుగా, సంగారెడ్డికి దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. మిగిత వివరాలకు ఫోన్ నెం 94901-29839కు సంప్రదించాలని కలెక్టర్ కోరారు.