స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్‌ పెంపు

4

– రాజ్‌నాథ్‌ సింగ్‌

న్యూఢిల్లీ,ఆగష్టు 9(జనంసాక్షి): స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చే పింఛన్‌ 2014-2015 సంవత్సరానికి డీఏను 218శాతానికి పెంచినట్లు కేంద్ర హాంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ తెలిపారు. క్విట్‌ ఇండియా 73వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1947లో స్వాతంత్య్ర సాధనకు అవిరామంగా కృషిచేసిన సమరయోధులకు శిరస్సువంచి నమస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు.మహాత్మగాంధీ ముందుండి ఈ ఉద్యమాన్ని నడిపించగా అందులో వేలసంఖ్యలో స్వాతంత్య్ర సమరయోధులు దేశస్వాతంత్య్ర సాధన కోసం పోరాడారన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సవరించిన పింఛన్‌ను ఆగస్టు 1 2014నుంచి అందించనున్నట్లు తెలిపారు. పింఛన్‌ను అందుకుంటున్న వారిలో తెలంగాణ 6,204 మందితో మొదటి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్‌ 6,031 మందితో రెండో స్థానంలో ఉంది. పశ్చిమ బంగ, మహారాష్ట్ర, బిహార్‌, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.