స్వామివారికి ఔషధీకృత ద్రవ్యాలతో విశేష అభిషేకాలు నిర్వహించిన అర్చకులు

అల్వాల్ పట్టణ కేంద్రంలోని ప్రపంచంలో అరుదైన      మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం డైరీ ఫార్మ్ రోడ్ కానాజీ గూడ లో వెలసిన మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి దేవాలయంలో నిర్వహించుచున్న కార్తీకమాస ఉత్సవములు నేటితో ముగిశాయి.శుభ బుధవారం శ్రీవారికి 32 ఔషధీకృత ద్రవ్యాలతో విశేష అభిషేకాలు దర్బార్ సేవలో అన్నప్రసాద వితరణ దాతలకు ఆశీర్వచనాలునిర్వహించినఆలయవ్యవస్థాపకులుకార్యనిర్వహకులు డాక్టర్ మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి. ఆయన మాట్లాడుతూ అన్న ప్రసాద ట్రస్ట్ ఆలయ ట్రస్టు ఆలయఅభివృద్ధికిఎంతోతోడ్పడుతున్నాయని ఆయన వివరించారు. అన్న ప్రసాద వితరణలో పాల్గొనే భక్తులు ఆలయంలో సంప్రదించవచ్చని భక్తులను కోరారు. యధావిధిగా చిలకలగూడ చౌరస్తాలో మరియు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వద్ద సుమారు6000మందివరకుఅన్నప్రసాదవితరణకాగించబడుతున్నదనిభక్తులప్రోత్సాహంతోనేజరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్త ఆరన్ జ్యోతి,గీత ప్రియా,పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు