హక్కుల సాధన కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

యల్ హెచ్ పి యస్ రాష్ట్ర కార్యదర్శి కె. రాంజీ రాథోడ్.
తాండూరు అక్టోబర్ 18(జనంసాక్షి)హక్కుల సాధన కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని యల్ హెచ్ పి యస్ రాష్ట్ర కార్యదర్శి కె.రాంజీ రాథోడ్ కొరారు. మంగళ వారం జిల్లా అధ్యక్షులు గోపాల్ నేతృత్వంలో తాండూరు మండల పరిధిలోని అంతారం గిరిజన తండాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథులు గా హాజరయ్యారు .జిల్లా అధ్యక్షులు గోపాల్ నాయక్ జిల్లా కార్యవర్గంలో స్థానం కల్పిస్తూ కొందరిని నియమించి నియామక పత్రాలను రాష్ట్ర కార్యదర్శి కె రాంజీ రాథోడ్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రాంజీ రాథోడ్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కొరకు ఐక్యంగా ఉద్యమిం చాలని విధి విధానాలకులోబడి రాజ్యాంగ బద్ధమైన హక్కులు అధికారాల సాధన కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియ జేశారు .జిల్లా కమిటీలో నియమితులైన వారు ఉప అధ్యక్చులుగా యం గోపాల్ రాథోడ్ చందర్ ప్రధాన కార్యదర్శులుగా వి పవన్ ,రాజు రాథోడ్ కార్యదర్శిగా జె రవి కార్యవర్గ సభ్యునిగా కె బాలు యాలాల మండల అధ్యక్చులుగా రాథోడ్ విశాల్ నియమితులయ్యారు